Advertisement
ప్రస్తుతం నగదుకు ప్రాధాన్యత తగ్గుతున్న సంగతిని మనం గమనించాలి. ఎందుకంటే.. ప్రస్తుతం ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ ముఖ్యం అవుతున్నాయి. చిన్న రోడ్ సైడ్ షాపు నుంచి, పెద్ద మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్ వరకు ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ, ఆధునిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో ఏటీఎంలు కీలక పాత్రని పోషించాయి. అప్పట్లో బ్యాంకులో డబ్బు దాచుకుని అత్యవసరం అయినప్పుడు ఏటీఎమ్స్ నుంచి తీసుకోవడం లో ఏటీఎంల పాత్ర కీలకంగా ఉండేది. ఇప్పుడు కూడా ఏటీఎమ్స్ ని వాడుతూనే ఉన్నాం. అయితే.. ప్రపంచంలో మొట్టమొదటగా ఉపయోగించబడ్డ ఏటీఎం గురించి మీకు తెలుసా? దీని గురించిన పూర్తి విషయాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
Advertisement
జూన్ 23, 1925న బ్రిటిష్-స్కాటిష్ ఆవిష్కర్త జాన్ షెపర్డ్-బారన్ మొట్టమొదటిసారిగా ఏటీఎం ను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ATM జూన్ 27, 1967న యునైటెడ్ కింగ్‌డమ్‌లోని నార్త్ లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌లో ఉన్న బార్క్లేస్ బ్యాంక్ శాఖలో ప్రవేశపెట్టబడింది. అప్పటికి, ATM మెషీన్ల ఆవిష్కరణ కొత్తగా వచ్చింది. అప్పటి వరకు బ్యాంకు కు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సి వచ్చేది. ఈ ఏటీఎం వచ్చిన తరువాత డబ్బుని డ్రా చేసుకునే పని సులువు అయ్యింది.
Advertisement
1965లో ఓ శనివారం రోజు జాన్ డబ్బులు డ్రా చేసుకోవడం కోసం బ్యాంకుకు వెళ్లారు. అతని దురదృష్టం కొద్దీ బ్యాంకు మూసివేసే సమయానికి కేవలం ఒక నిమిషం లేటుగా వెళ్ళాడు. దీనితో బ్యాంకు తాళాలు వేసి కనిపించింది. దీనితో చేతిలో డబ్బు లేకుండా పోయింది. దీనితో అతనికి ఓ ఆలోచన వచ్చింది. డబ్బు డ్రా చేసుకోవడానికి ఒక యంత్రం ఎందుకు తీసుకురాకూడదు? అని అనుకున్నాడు. అదే సంవత్సరంలో, బార్క్లేస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ తో తన ఆలోచన గురించి చర్చించాడు. దాదాపు రెండు సంవత్సరాల తరువాత, జూన్ 1967లో, బ్యాంకింగ్‌లో విప్లవాత్మక ఆవిష్కరణకు నాంది పలికిన మొట్టమొదటి ఎటిఎం ఆవిష్కరణను ప్రపంచానికి చూపాడు. సర్ థామస్ బ్లాండ్ మొదటి ATMని తెరను వెనక్కి లాగి ఆవిష్కరించారు. నటుడు రెగ్ వార్నీ మొదటి నగదు ఉపసంహరణ చేసాడు. ATM గుర్తించిన రేడియోధార్మిక కార్బన్-14 ట్రేస్‌లతో కూడిన పేపర్ చెక్‌లను కస్టమర్‌లు ఉపయోగించారు, వాటిని నాలుగు అంకెల పిన్‌తో సరిపోల్చారు. ఆవిష్కర్త జాన్ షెపర్డ్-బారన్ ప్రకారం, వారి చెక్కులకు బదులుగా, కస్టమర్‌లు £10 నోటును అందుకున్నారు. ఆ సమయంలో అది ఎక్కువ డబ్బు కిందే వస్తుంది. ఇది ఆధునిక బ్యాంకింగ్ సౌలభ్యానికి నాంది పలికింది.
మరిన్ని..
విజయ్ మాల్యా తండ్రి విట్టల్ మాల్యా గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు? అస్సలు ఊహించి ఉండరు!
మంత్రి కేటీఆర్ కారుని చెక్ చేసిన పోలీస్ అధికారులు.. అందులో ఏమున్నాయంటే?