Advertisement
రావణుడికి పరస్త్రీ లోలత్వం తప్ప మరో దుర్గుణం లేదు. అపార జ్ఞానాన్ని ఆర్జించి రావణ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడాయన. అపరిమిత శక్తులు ఆయన సొంతం. కానీ, స్త్రీ లోలత్వం కారణంగానే ఆయన జీవితం పతనమైంది. కానీ, ఆయన భార్య మండోదరి రావణ బ్రహ్మని గొప్పగానే భావిస్తుంది. అయితే.. రామ రావణ యుద్ధం ముగిసిన తరువాత రాముని చేతిలో రావణుడు ఓడిపోవడం, మరణించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. మానవుడు అయిన రాముని చేతిలో రావణుడు మరణించడం ఏంటి? అని ఆమె షాక్ కి గురి అయ్యింది.
Advertisement
తన భర్తని అల్పుడైన మానవుడు ఎలా సంహరించాడు? ఇది ఎలా సాధ్యం? అని మధనపడుతూ వెంటనే యుద్ధ భూమికి వచ్చేసింది. సరైన వస్త్ర ధారణ లేకున్నా, కొప్పుని కనీసం ముడి కూడా వేసుకోకుండా అలానే యుద్ధ భూమికి వచ్చేసింది. మనసులో రాముడిపై పీకల దాకా కోపాన్ని పెంచుకొంది. కనిపించగానే రాముడిని తిట్టేయ్యాలని అనుకుంది. ఎందుకంటే.. ఆమె గతంలో ఎప్పుడూ రాముడి గురించి వినలేదు. రాముడిని చూడలేదు. తన భర్తని చంపేశాడన్న కోపం మాత్రమే రాముడిపై ఉంది.
Advertisement
రావణ వధ పూర్తి కాగానే.. ఇరువైపు సైన్యాలు నిస్చేష్టులయ్యారు. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. రాముడు కూడా ఓ బండ రాయిపై కూర్చుండిపోయాడు. సూర్య కిరణాలూ పడడం వలన తన నీడ తనకే కనిపిస్తోంది. అదే సమయంలో మండోదరి వెనక నుంచి రాముడి వద్దకు రాబోయింది. అయితే.. తన పక్కాగా మరొక నీడ వస్తోందని.. అది ఓ స్త్రీ నీడ అని, అది సీతది కాదని రాముడు గుర్తించాడు. వెంటనే అక్కడ నుంచి లేచి పక్కకు తప్పుకున్నాడు. అంత బాధలో ఉన్న మండోదరి కూడా ఇది గమనించింది. మొదటి సారి ఆమెకు రాముడంటే ఏమిటో అర్ధం అయ్యింది. ఆ ఒక్క చర్యతో అప్పటి వరకు ఆమెకు రాముడిపై ఉన్న కోపం, ఆక్రోశం చప్పున చల్లారిపోయాయి. పరస్త్రీ నీడని కూడా తాకని ఉత్తముడు రాముడు. అందుకే ఆయన్ని ఏకపత్నీవ్రతుడంటారు.