Advertisement
తెలుగు ఇండస్ట్రీలో బిచ్చగాడు అనే మూవీ తో ఎంట్రీ ఇచ్చి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని.. ఈయన ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తిరుగులేని పేరును సంపాదించుకున్నారు.. ఇక ఈ సినిమా నుంచి మొదలు ఆయన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.. విజయ్ కేవలం ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన తండ్రి మరణించాడు.. అప్పుడు విజయ్ చెల్లి వయస్సు నాలుగు సంవత్సరాలు.. ఆయన తల్లి ఉద్యోగం చేసి వీరిద్దరిని చూసుకునే వారట..ఒక్కోసారి ఉద్యోగం వల్ల వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చినా పిల్లల చదువు కోసం ఆలోచించి దూర ప్రయాణం చేసి మరీ ఉద్యోగం చేసేవారట ఆయన తల్లి. కె. విజయ్ లయోలా కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో చదువుకున్నాడు విజయ్.
Advertisement
also read:
Advertisement
ఆ తర్వాత సౌండ్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.. ఇక విజయ్ తల్లి ఉద్యోగరీత్యా శిక్షణా తరగతులకు వెళ్లాలి వచ్చిన సమయంలో విజయ్ ని హాస్టల్లో ఉంచి తనతోపాటు తన కూతురిని తీసుకెళ్లేదట. హాస్టల్ లో ఉన్న సమయంలో రెండు రోజులు సెలవు దొరకడంతో వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థుల శిబిరంలో బస చేసానని విజయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. చేతిలో రూపాయి కూడా లేని సమయంలో అరటి పండ్లు తింటూ జీవనం సాగించానని తన కష్టాల గురించి చెప్పారు హీరో విజయ్..
ఇక ఆయనకు సినిమాలపై ఎక్కువ ఇష్టం ఉండడం తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి నాన్ 2012 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. దీని తర్వాత సలీం అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుని ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఈ తరుణంలోనే విజయ్ పెళ్లి సంచలనం సృష్టించింది అని చెప్పవచ్చు. అయితే విజయ్ ఆంటోని ని ఫాతిమా అనే జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఆవిడతో లవ్ లో పడి చివరికి ఆవిడనే వివాహం చేసుకున్నారట.. ఈ దంపతులకు లారా అనే కూతురు కూడా ఉంది..
also read: