Advertisement
నందమూరి నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తక్కువ కాలంలోనే స్టార్ డం సంపాదించాడు. అచ్చం తాత పోలికలే కాదు, నటనను కూడా పునికి పుచ్చుకున్నాడు. చిన్నప్పుడు రామారావు దగ్గరే ఎక్కువగా పెరిగాడు. అందుకే తాత లక్షణాలు ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఇది ఇలా ఉండగా సెలబ్రిటీల, లైఫ్ స్టైల్ లగ్జీరియస్ గాడ్జెట్స్, వాడే మొబైల్స్, పెట్స్, కార్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు తారక్ లైఫ్ స్టైల్ కి సంబంధించిన విషయాలు కొన్ని తెలుసుకుందాం.
Advertisement
గతంలో హైదరాబాద్ లోని మెహదీపట్నంలో ఉండే తారక్, కొద్ది కాలం క్రితం జూబ్లీహిల్స్ షిఫ్ట్ అయ్యాడు. తన టేస్ట్ కి తగ్గట్టు అత్యాధునిక సౌకర్యాలతో అందమైన ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ హౌస్ ల్యాండ్ యొక్క ప్రెసెంట్ మార్కెట్ వ్యాల్యూ ఎంతో తెలుసా అక్షరాల 60 నుండి 80 కోట్లు. ఇండియాలో లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాపుల్ ని 3.5 కోట్లతో సొంతం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
Advertisement
ఇక తారక్ చేతికి పెట్టుకునే రీఛార్జ్ మిళ్లే ఎఫ్ వన్ ఎడిషన్ వాచ్ ఖరీదు 3 నుండి 4 కోట్లు. ఎన్టీఆర్ గ్యారేజీ లో ఉన్న ఖరీదైన కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ కూడా ఒకటి. ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్న ఈ కార్ ధర 2.3 కోట్లు. జూనియర్ కొన్న పోర్సియో 718 కయోన్ కార్ కాస్ట్ 1.25 కోట్లు ఉంటుంది.
యంగ్ టైగర్ వాడే బిఎండబ్ల్యూ 720ఎల్డీ కార్ ప్రైజ్ 1.32 కోట్లు ఉంటుంది. మెర్సిడేస్ మెంజ్ జిఎల్సి 350Dధర 90 లక్షల రూపాయలు ఉంటుంది. ఇక టు వీలర్ విషయానికొస్తే, తారక్ దగ్గర 14 లక్షల విలువ చేసే సుజికి హయాబుసా స్పోర్ట్ బైకు కూడా ఉంది.
తారక్ వాడే అన్ని లగ్జరీ వెహికల్స్ కి 9999 నెంబరే ఉంటుంది.
Also Read: ఊహతో హీరో శ్రీకాంత్ విడాకులు?