Advertisement
క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న ఈ వేళానికి 991 మంది ప్లేయర్లు పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. ఇందులో 714 మంది భారతీయ క్రికెటర్లు కాగా, మిగిలిన 277 మంది ఫారిన్ ప్లేయర్లు. ఐపీఎల్ 2023 మినీ వేలంలో 21 మంది ప్లేయర్లు రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ కి రిజిస్టర్ చేసుకున్నారు.
Advertisement
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్, ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ తో పాటు కామెరూన్ గ్రీన్, కేన్ విలియంసన్, నికోలాస్ పూరన్ వంటి ఆటగాళ్లు రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ లిస్టులో వేలానికి రాబోతున్నారు. అయితే రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ లిస్టులో కాదు కదా కోటిన్నర బేస్ ప్రైస్ లిస్టులో కూడా ఒక్క భారత ప్లేయర్ కూడా లేకపోవడం విశేషం. ఐపీఎల్ 2023 మినీ వేలంలో భారత బ్యాటర్ మయాంక్ అగర్వాల్ రూ. 1 కోటి బేస్ ప్రైస్ కి రిజిస్టర్ చేసుకోగా, ఇశాంత్ శర్మ రూ. 75 లక్షలు, అజింకా రహనే రూ. 50 లక్షల బేస్ ప్రైస్ లిస్టులో చేరారు.
Advertisement
ఐపీఎల్ 2023 మినీ వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిసి అత్యధికంగా 87 ప్లేయర్లను వేలం పాటలో కొనుగోలు చేయబోతున్నారు. ఇందులో 30 మంది విదేశీ ప్లేయర్లు ఉంటారు. మినీ వేలంలో పాల్గొనే భారత ప్లేయర్లలో 19 మంది టీమ్ ఇండియాకి ఆడిన వారు, 91 మంది ఐపిఎల్ లో ఇంతకుముందు ఆడిన అన్ క్యాప్డ్ ప్లేయర్లు. మిగిలిన వారంతా ఐపిఎల్ లో కూడా చోటు దక్కించుకొని వాళ్లే. అయితే ఐపిఎల్ 2023 మినీ వేలంలో స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి అసోసియేట్ దేశాల నుంచి 20 మంది ప్లేయర్లు వేలంలో పాల్గొనబోతున్నారు. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా 57 మంది ఈ మినీ వేలంలో పాల్గొంటుంటే, సౌత్ ఆఫ్రికా నుంచి 52, వెస్టిండీస్ నుంచి 33 మంది ప్లేయర్లు వేలానికి రాబోతున్నారు.
READ ALSO : Dwayne Bravo : ఐపీఎల్ కు మరో విండీస్ వీరుడు గుడ్ బై..అంతలోనే బిగ్ ట్విస్ట్ !