Advertisement
సాధారణంగా క్రికెట్ ఆడే సమయంలో ప్లేయర్స్ వివిధ రకాల వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు. ఏ ఆటగాళ్లకు ఆ యొక్క జెర్సీ ఉండడమే కాకుండా వివిధ వస్తువులు వారి ఫేవరెట్ గా ఉంటాయి. అయితే ఐపిఎల్ సీజన్ లో ఇయాన్ మోర్గాన్ టోపీ పెట్టుకుని కనిపించడం క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన చర్చకు దారితీసింది.
Advertisement
ఒకానొక సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగినటువంటి మ్యాచ్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ ఈయాన్ మోర్గాన్ మైదానంలో రెండు టోపీలు పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయానికి వస్తే కోవిద్ తర్వాత ఐసీసీ ఆటరూల్స్ మార్చివేసింది. సాధారణంగా బౌలర్ బౌలింగ్ కు వచ్చినప్పుడు అతని స్వెటర్, క్యాప్ ఎంపైర్ కి ఇచ్చేవారు. కానీ కోవిడ్ కారణంగా మైదానంలో ఆటగాళ్లు సైతం సామాజిక దూరం పాటిస్తూ, ఒకరిని మరొకరు తాకడం మానేశారు. తాకకూడదని ఐసీసీ కూడా రూల్స్ విధించింది.
Advertisement
అయితే బౌలర్లు తమ క్యాప్ లను కెప్టెన్ తలపై పెడుతూ ఉన్నారు. దీంతో కెప్టెన్లు కొందరు ఆటగాళ్లు రెండు క్యాప్ లతో కనిపిస్తూ ఉన్నారు. చెమట చేతి, స్పర్శ ద్వారా కూడా కోవిద్ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండడంతో ఐసీసీ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దీన్ని తొలిసారిగా ఇంగ్లాండ్ వెస్టిండీస్ మ్యాచ్ ల నుంచి అమలు చేసిందని సమాచారం. అందుకే మైదానంలో ఆటగాళ్లు రెండు లేదా మూడు క్యాప్ లతో కనిపించడం ప్రేక్షకులను ఆలోచనలో పడేసిందనేది అర్థం.
also read: