Advertisement
IPL: మొత్తం ఐపీఎల్లో 10 టీంలు ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా చిన్న చిన్న మార్పులతో రూపొందించిన జెర్సీలతో సరికొత్త జెర్సీలతో టీం లన్ని కూడా బరిలోకి దిగుతూ ఉంటాయి. చాలా టీమ్స్ తమ జెర్సీలలో చాలా మార్పులు చేశాయి. ముంబై ఇండియన్స్ అంటే మనకి బ్లూ, చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఎల్లో జెర్సీలు గుర్తొస్తాయి. ప్రతి టీ వల్ల జెర్సీలు ఎంతో ప్రత్యేక గుర్తింపుని తీసుకొస్తాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఐపీఎల్ మ్యాచ్లో ఇప్పుడు చూసినట్లయితే ఒకసారి మాత్రం ప్రత్యేక జెర్సీలో ఆటగాళ్లు కనపడుతుంటారు.
Advertisement
అయితే అన్ని టీమ్లకి ప్రత్యేక జెర్సీలు లేవు. ఈ ఐదు టీమ్స్ మాత్రమే స్పెషల్ జెర్సీలో దర్శనం ఇస్తారు, ఈ స్పెషల్ జెర్సీ అనే సంప్రదాయాన్ని తీసుకువచ్చింది ఆర్సీబీ. రెడ్ కలర్ ఎక్కువగా వేసుకునే ఆర్సిబి స్పెషల్ జెర్సీ గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ జెర్సీతో ఒక్క మ్యాచ్ ఆడతారు. గ్రీన్ కలర్ జెర్సీ పరిశుభ్రమైన పచ్చటి వాతావరణం గురించి అవగాహన కల్పించడం కోసం వేసుకుంటారు. పింక్ ప్రామిస్ లో భాగంగా గ్రామీణ భారతదేశంలో మహిళా సాధికారత కోసం ఫుల్ పింక్ కలర్ జెర్సీలో రాజస్థాన్ రాయల్స్ కనబడతారు.
Advertisement
Also read:
Also read:
లక్నో సూపర్ జాయింట్స్ గుజరాత్ టైటాన్స్ కూడా స్పెషల్ జెర్సీలో కనబడుతుంటారు బ్రౌన్ అండ్ గ్రీన్ కలర్ జెర్సీలో ఎల్ ఎస్ జి బరిలోకి దిగుతుంది. క్యాన్సర్ పై పోరాడడానికి మద్దతుగా లావెండర్ జెర్సీ లో గుజరాత్ టైటాన్స్ ఆడుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక నగర ఐకానిక్ మెట్రో లైన్ ని కలిగి ఉన్న ఢిల్లీ నగర వారసత్వం ఆవిష్కరణలు చేసి పూర్తి పొందిన బ్లూ జెర్సీలో ఒక మ్యాచ్ ఆడుతుంది ఇలా స్పెషల్ జెర్సీలో ఆటగాళ్ళు ఒక్కసారైనా ఐపీఎల్ సీజన్ లో ఆడతారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!