Advertisement
టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ విజయం సాధించింది. వర్షం కారణంగా 14.3 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ విజయం సాధించినట్లు ప్రకటించారు. ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్ స్టోన్ కు మూడు, సామ్ కర్రాన్ కు రెండు, మార్కువుడ్ కు మూడు, బెన్ స్టోక్స్ కు ఒక వికెట్ దక్కాయి. ఐరిష్ బ్యాటర్లలో కెప్టెన్ అండ్రు బిల్బీర్ని 62 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే, అసోసియేట్ టీమ్స్ చేతిలో ఇంగ్లాండు ఓడిపోవడం ఇది తొలిసారి ఏమీ కాదు. 2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో ఓడింది ఇంగ్లాండ్. ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో మూడో పరాభవం ఎదురయింది.
Advertisement
Read also : భర్త… భార్యకు ఏ విధంగా ఉంటే నచ్చుతుందో తెలుసా, ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
Advertisement
అయితే, 2011 వన్డే వరల్డ్ కప్ లో కూడా ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండు ఓడిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. టీమిండియా ఫ్యాన్స్ ఐర్లాండ్ విజయాన్ని గుర్తు చేసి టీమిండియా ఈ ఏడాది ప్రపంచ కప్ 2022 విజేత అని నమ్ముతున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ లో ధోని నేతృత్వంలోని టీమిండియా మెగా టోర్నీని దక్కించుకుంది. ఆ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ జట్టును ఐర్లాండ్ ఓడించింది. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ మరోసారి ఐర్లాండ్ చేతిలో ఓడింది. దీంతో, ఆ సెంటిమెంట్ ప్రకారం టీమిండియా ఈ ఏడాది వరల్డ్ కప్ ఎగరేసుకుపోతుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. ఇటీవలే.. సంచలన ప్రకటన అని చెప్పి.. ఓరియో బిస్కెట్ వేసిన.. ధోని వ్యాఖ్యలు గుర్తు చేస్తూ….ఆయన చెప్పిందే నిజం కాబోతుందంటూ ట్వీట్లు పెడుతున్నారు.
అసలు ధోని ఓరియో ప్రకటన ఏంటి ?
ఇటీవల మీడియా ముందుకు వచ్చిన ధోని మీడియా తో మాట్లాడుతూ…. భారతదేశంలో ఓరియో 2011 లో లాంచ్ అయింది. అదే ఏడాది టీమిండియా ప్రపంచకప్ నెగ్గింది. మీకు లింక్ అర్థం అవుతుంది కదా, ఈ రెండు వ్యాఖ్యాలను మరి విసుగొచ్చేలా ఓ పదిసార్లు చెప్పాడు ధోని. అంటే… ఈ ఏడాది ఓరియో అంటే 2022 లో లాంచ్ అయింది. కాబట్టి.. 2022 ప్రపంచకప్ ను టీమిండియా గెలుస్తుందన్న మాట. ఈ విషయాన్ని ధోని ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. ఇక ఇవాళ ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ విజయం సాధించడంతో.. ధోని వ్యాఖ్యలే నిజమౌవుతున్నాయని మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఫ్యాన్స్.