Advertisement
పుట్టిన శిశువు నుంచి ముసలి తాత వరకు ప్రతి ఒక్కరిలో వాసన పసిగట్టే గుణం ఉంటుంది. ఏదైనా మంచి వాసన వచ్చినప్పుడు మన మనసు ఆహ్లాదంగా మైండ్ ఫ్రెష్ గా అవుతుంది. అదే దుర్వాసన వస్తే మన బాడీ మరో రకంగా స్పందిస్తుంది. ఈ వాసనలను మన ముక్కులోని పై భాగాల్లో ఉండేటువంటి వాసనాళాలు గుర్తుపట్టగలవు. ఇక్కడి నుంచే సాంకేతాలను మెదడులోకి పంపిస్తుంది. అయితే మనుషుల శరీరం నుంచి వచ్చే సువాసనలను కూడా మన మెదడులోని “లింబిక్ సిస్టం ” స్పందిస్తుందని స్వీడన్ పరిశోధకులు తెలియజేస్తున్నారు. వీరు ఈ అధ్యయనం కోసం కొందరు వాలంటీర్ల చంకల్లో చెమటను సేకరించారు.
Advertisement
ALSO READ: మొట్టమొదటి బస్ డ్రైవర్ గా 24 ఏళ్ల షర్మిల.. సెల్యూట్ చేస్తున్న ప్రయాణికులు..!!
also read:Rashi Phalalu in Telugu 2023 : ఈ రోజు రాశి ఫలాలు 05.04.2023
Advertisement
ముఖ్యంగా ఏదైనా భయంకరమైన సినిమా చూసినప్పుడు లేదా సంతోషాన్ని పంచే సినిమా చూసినప్పుడు వచ్చే చెమటను తీసుకున్నారు. సోషల్ యంగ్సైటి తో బాధపడే 45 మంది మహిళలకు ఆ నమూనాల వాసనను చూపించారు. వీరికి మైండ్ ఫుల్ నేస్ లాంటి చికిత్సలు అందించారు. నెగిటివ్ ఆలోచనల కంటే ప్రస్తుత వాసన పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని వీరికి సూచనలు చేశారు. అలా మరి కొంతమంది మహిళలను స్వచ్ఛమైన గాలివాసన చూడమని చెప్పారు.
ఇందులో చెమట వాసన చూసిన వారు మైండ్ ఫుల్ నెస్ థెరపీకి మెరుగ్గా స్పందించారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇక్కడ సంతోషంగా ఉన్నప్పుడు లేదా భయపడుతున్నప్పుడు ఏ సమయంలో చెమట అయినా ఒకేలాంటి ప్రభావం చూపుతోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఎలిసా విస్ నా చెప్పారు. ఇతరుల చెమట వాసన పీల్చుకోవడంతో మనలో కలిగే మార్పులు ఆ చికిత్సకు ప్రభావితం చేస్తున్నట్టు పరిశోధనలో గుర్తించామని ఆమె వివరించారు.
also read: