Advertisement
చపాతి లేదా రోటి అనేది భారతీయ భోజనంలో భాగమైపోయింది. చాలామంది బరువు తగ్గడానికి రాత్రి పూట చపాతీలను తింటున్నారు. వైద్యులు కూడా మనకు రాత్రి పూట చపాతీలను తినమని సూచిస్తున్నారు. చపాతి/ రోటి.. వీటిని అల్పాహారంగా కొందరు తింటే, మరికొందరు దీనిని భోజనంగా తీసుకుంటారు. చపాతీలను నూనె వేయకుండా కాలిస్తే వాటిని పుల్కాలు అని అంటారు. స్థూలకాయం ఉన్నవారు వీటిని తినేందుకు ఇష్టపడుతుంటారు. ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఇది ప్రధాన ఆహారము. చపాతిని నూనె వేసి కాలుస్తారు. కానీ రోటీని మాత్రం నూనె లేకుండా కాలుస్తారు. చపాతిని పెనంపై కలిస్తే, రోటీని కొంతమంది నేరుగా మంట మీద పెట్టి కాలుస్తారు. ముందుగా పెనంపై ఒక నిమిషం కాల్చి తరువాత ఆ రోటీని మంట మీదకి మారుస్తారు.
Advertisement
Read also: రియల్ కఠారి కృష్ణ ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?
ఇలా కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యాయాలు చెబుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల హెటేరోసైక్లిక్ అమైన్ లు (HCA) లు, పాలీసైక్లిక్ ఆటోమేటిక్ హైడ్రో కార్బన్ లను (PAHs) ఉత్పత్తి అవుతాయని, దీంతో అవి క్యాన్సర్ కారకాలని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. సహజవాయువు స్టవ్ లు, కుక్ టాప్ లు కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయు కాలుష్యాలను విడుదల చేస్తాయి. అసురక్షితమని భావించే చిన్న రేణువులను విడుదల చేస్తాయి. వీటివల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.
Advertisement
ఇక న్యూట్రీషన్ అండ్ క్యాన్సర్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. అధిక ఉష్ణోగ్రత వద్ద చేసిన వంట క్యాన్సర్ కారకంగా మారుతుందని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. అలాగే ఫుడ్ స్టాండర్డ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సౌత్ లో పనిచేసిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పాల్ బ్రాండ్ 2011లో ఇదే విషయంపై ఒక నివేదికను తయారు చేశారు. రోటీలు, గ్యాస్ ఫ్లేమ్స్ తో ప్రత్యక్ష సంబంధం లోకి వచ్చినప్పుడు అది అక్రీలమైడ్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. గ్యాస్ ప్రత్యక్ష మంటలలో ఆహారాన్ని వండినప్పుడు క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి చేయబడతాయి. ఇవి మనిషి శరీరానికి ప్రమాదకరమైనవి. అలాంటప్పుడు అది మానవ వినియోగానికి సురక్షితం కాదని ఆయన తన పరిశోధనలో తెలిపారు. కాబట్టి పెనం మీద కాల్చిన చపాతీలను తినడం సురక్షితం.
Read also: పెళ్లి తరువాత భార్య, భర్త ఎందుకు బరువు పెరిగిపోతారు ? 5 కారణాలు ఇవేనా ?