Advertisement
రెబల్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే నటుడు ప్రభాస్ ‘సాలార్ పార్ట్ 1’ సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసింది మరియు రేపు జనవరి 20 నాటికి అంతర్జాతీయ OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ లో ప్రదర్శితం అవ్వడానికి సిద్ధంగా కూడా ఉంది.
Advertisement
తాజాగా, అయోధ్యలోని రామమందిరానికి రూ. 50 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో నటుడు ప్రభాస్ వార్తల్లో నిలుస్తున్నారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం రోజున అయ్యే ఆహార ఖర్చులను అందించడానికి ప్రభాస్ ఒప్పుకున్నారు అంటూ పుకార్లు వచ్చాయి. అయితే.. ఇండియా టుడే టీం ఈ విషయమై ప్రభాస్ టీం ని సంప్రదించగా.. ఈ వార్తలు కేవలం పుకార్లు అని తేలింది. ప్రభాస్ టీం అది ఫేక్ న్యూస్ అని పేర్కొంది.
Advertisement
ఆంద్రప్రదేశ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రారంభోత్సవం రోజున ఆలయంలో ఆహార ఖర్చులు చూసుకోవడానికి ప్రభాస్ అంగీకరించినట్లు చెప్పినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అది ఫేక్ అని ఇప్పుడు తేలింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జనవరి 22న జరగనుంది, ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా రజనీకాంత్, చిరంజీవి, రామ్ చరణ్, JR ఎన్టీఆర్ మరియు ధనుష్ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అయితే ప్రభాస్‌కి ఆహ్వానం వచ్చిందో లేదో తెలియాల్సి ఉంది.
Read More:
ఎన్టీఆర్, ప్రభాస్ కాంబోలో రాజమౌళి తీయాల్సిన సినిమా ఎలా ఆగిపోయింది? అసలేమైందంటే?