Advertisement
మహేంద్ర సింగ్ ధోని తర్వాత స్థాయిలో విజయవంతమైన కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు తెచ్చుకున్నారు. హిట్ మ్యాన్ గా సరికొత్త రికార్డులను సృష్టించారు. స్వదేశంలో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ టి20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా పై విజయాన్ని సాధించింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఓటమి భర్తీ చేశాడు T20 వరల్డ్ కప్ లో టీం ఇండియా గెలిచిన తర్వాత T20 ఫార్మేట్ కి రోహిత గుడ్ బై చెప్పడం జరిగింది. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన రోహిత్ శుక్రవారం ఇండియాకి తిరిగి వచ్చాడు.
Advertisement
శనివారం సాయంత్రం శ్రీలంక బయలుదేరి వెళ్లిపోయాడు. ప్రస్తుతం టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. మొన్న జరిగిన సిరీస్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీలని సొంతం చేసుకుంది ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని దక్కించుకుంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడకపోవచ్చు అని ప్రచారం అయితే జరుగుతోంది.
Advertisement
Also read:
Also read:
రోహిత్ ని పక్కన పెట్టిన ముంబై యజమాన్యం హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీని అప్పగించింది గుజరాత్ నుండి రిటైన్ చేసుకుని కెప్టెన్ గా హార్దిక్ ని నియమించిన నాటినుండి అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనికి ముంబై జట్టు తీరు కూడా తోడు కావడంతో హార్దిక్ తీవ్ర విమర్శలకు గురయ్యారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!