Advertisement
Manchu Manoj Wedding with Bhuma Mounika Reddy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు వారి ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ గా పేరుపొందిన మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా వార్తలో నిలుస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఆయన భూమా మౌనిక రెడ్డి అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుండడం.. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అయితే తాజాగా వీరిద్దరూ పెళ్లి ద్వారా ఒకటో బోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read:బాలయ్య కాలు తొక్కానని షూటింగ్ ఆపారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..!!
అది కూడా మోహన్ బాబు లేకుండానే వీరి పెళ్లి జరగబోతుందని సమాచారం. అయితే భూమా మౌనిక తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చి మంచు మనోజ్ ను పెళ్లి చేసుకోవడం కోసం తాపత్రయపడుతోంది. ఈ తరుణంలో మోహన్ బాబుకు ఆ అమ్మాయిని తన కొడుకు చేసుకోవడం ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం భూమా మౌనిక టిడిపి పార్టీకి చెందిన వ్యక్తి కూతురు.మోహన్ బాబు మాత్రం ఈ మధ్యకాలంలో జగన్ తో ఎక్కువగా కలిసి ఉంటున్నారు.
Advertisement
Also Read: ఫ్యామిలీతో సూర్య విడిపోయారా.. గొడవలకు కారణం ఆవిడేనా..?
కాబట్టి ఆ అమ్మాయిని మంచు మనోజ్ చేసుకోవద్దని ఆయన ఈ పెళ్లికి నో చెప్పారట. దీంతో మంచు మనోజ్ తన తండ్రితో గొడవ పెట్టుకున్నారట. ఇది భరించలేని మోహన్ బాబు ఆస్తులను కూడా పంచేసి మనోజ్ ను బయటకు పంపారని తెలుస్తోంది. దీంతో మంచు వారి కుటుంబం మనోజ్ తో మాట్లాడడం లేదని సమాచారం అందుతుంది.
ఈ తరుణంలోనే మంచు లక్ష్మి మంచు మనోజ్ తో కాస్త మాట్లాడుతుందని ఈమె దగ్గరుండి మనోజ్,మౌనికల పెళ్లి చేస్తుందని తెలుస్తోంది. మరి పెళ్లికి మోహన్ బాబు మరియు ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వస్తారా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది. అయితే మంచు అభిమానులు మాత్రం మంచు ఫ్యామిలీ అంతా ఓకే ఫ్రేమ్లో కనిపిస్తే బాగుంటుంది అని కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Also Read: Telugu News, Movie News in Telugu