Advertisement
ప్రస్తుతం టాలీవుడ్ లో తరచూ వార్తల్లో నిలుస్తున్న పేరు పవిత్ర లోకేష్. ఈమె టాలీవుడ్ నటుడు నరేష్ తో సహజీవనం చేస్తున్నప్పటి నుంచి పవిత్ర లోకేష్ కి సంబంధించిన పలు విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా నరేష్-పవిత్ర లోకేష్ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకాధారణ పొదుతోంది. ప్రస్తుతం పవిత్ర తల్లిగా, అత్తగా పలు పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది.
Advertisement
ముఖ్యంగా పవిత్ర లోకేష్ అప్పటి హీరోయిన్ల కంటే కూడా అందెగత్తె అని చెప్పుకుంటారు. ఈమె కర్ణాటకలోని మైసూర్ లో జన్మించారు. ఈమె తండ్రి కన్నడ స్టేట్ కమ్ ఫిల్మ్ యాక్టర్. తండ్రి వారసత్వంతోనే సినిమాల్లోకి అడుగుపెట్టారు పవిత్ర లోకేష్. పలు కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అదేవిధంగా టెలిజన్ లలో కూడా నటించారు. 1994లో కన్నడ మెగాస్టార్ అంబరీష్ నటించిన మిస్టర్ అభిషేక్ సినిమాలో నటించింది. పవిత్ర లోకేష్ దాదాపు 150కి పైగా కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. 2006లో వచ్చిన నాయి నేరాలు అనే సినిమాలో పవిత్ర లోకేష్ నటనకు కర్ణాటక స్టేట్ అవార్డు అందుకున్నారు. పవిత్ర లోకేష్ కి ఇదివరకే పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఆమె మొదటి భర్త కన్నడ నటుడు సుచీంద్ర ప్రసాద్. వీరికి ఇద్దరూ సంతానం. వీరిద్దరి మధ్య మనస్పార్థాల కారణంగా విడాకులు తీసుకొని 2018లో విడిపోయారు. ఈ నేపథ్యంలో నటుడు నరేష్ కి దగ్గరై సహజీవనం చేస్తోంది.
Advertisement
టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలకు తల్లిగా, అత్త వంటి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది. హీరోయిన్ కంటే అందంగా ఉన్న పవిత్రకు హీరోయిన్ అవకాశాలు తక్కువగానే ఉంటాయని చెబుతుంటారు. అందుకు కారణం ఏంటంటే.. హీరోల కంటే కూడా కాస్త పొడవుగా ఉండటమేనట. స్టార్ హీరోయిన్ కాలేకపోయిందని అంటుంటారు సినీ విశ్లేషకులు. ఇదిలా ఉంటే.. మళ్లీ పెళ్లి మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో పవిత్రలోకేష్ స్థానంలో అనన్య నాగళ్ల నటించింది. యుక్త వయస్సు నటనతో పాటు గ్లామర్ తో అప్పటి యూత్ ని ఆకట్టుకున్నట్టు అద్భుతంగా చూపించారు.
మరికొన్ని ముఖ్య వార్తలు :
ఇద్దరు ప్రియుళ్లతో కలిసి యువతి ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
ఉన్నత చదువుల కోసం ఇంటిని అమ్మీ విదేశాలకు పంపిస్తే.. ఏం చేసిందో తెలుసా ?