Advertisement
సాధారణంగా ఒక సినిమా నచ్చిందంటే చాలు దానికి రిలేటేడ్ కథతోనే చాలా సినిమాలు వస్తుంటాయి. వాస్తవానికి ఈ సినిమాలు అన్ని కూడా దాదాపు ఒకే కథాంశంతోనే నడుస్తుంటాయి. అందుకే ఒక్కో సమయంలో ఒక్కో కథలు ఇండస్ట్రీలో నడుస్తుంటాయి. ప్రస్తుతం కొన్ని కథలు మాత్రమే ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. అవి ఏంటంటే.. థ్రిల్లర్స్.. సైన్స్ ఫిక్షన్ లాంటి కథలు ఇప్పుడు తెలుగులో కానీ ఇండియన్ మూవీలో కానీ నడుస్తున్నాయి.
Advertisement
ప్రతీ ఏడాది సినిమా తీసే విధానం కానీ చూసే విధానం కానీ మారతుంటుంది. దీనికి తగినట్టుగానే కొత్త రకమైన కథలు వస్తుంటాయి. కొందరూ ఇప్పటికీ కూడా ఒకే రకమైన పాత చింతకాయ పచ్చడి స్టోరీలతో కూడా హిట్ కొడుతుంటారు. అవి ఎక్కువగా జనాధరణ పొందలేవు. అందుకే ఇప్పుడు ఉన్న దర్శకులు కూడా కొత్త కథలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తున్నారు.
Advertisement
ఇలాంటి కథలు దాదాపు ఒకేవిధంగా ఉన్నా కూడా దర్శకుడు చేసే మ్యాజిక్ మీదనే వాటి సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పోకిరి సినిమా వచ్చాక ఆ సమయంలో దాదాపు అన్ని అలాంటి సినిమాలే వచ్చాయి. అందులో కొన్ని హిట్ అయితే.. మరికొన్ని ప్లాప్ అయ్యాయి. మగధీర మూవీ వచ్చాక అలాంటి కథలతో వచ్చిన బద్రినాథ్, శక్తీ ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఒక్కో సమయంలో ఒక్కో కథతో మన దర్శకులు వచ్చి హిట్ కొట్టడం అనేది మనం చూస్తూనే ఉంటాం. బద్రినాథ్, శక్తి ఈ రెండు సినిమాలు కూడా మంచి సినిమాలే అయినప్పటికీ వీటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగాలేక ఈ సినిమాలు ప్లాప్ అయ్యాయి.