Advertisement
భారతీయ సంప్రదాయం ప్రకారం మనం వివాహం కానీ, ఏదైనా పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నప్పుడు మన కంటే పెద్ద వారు వివాహం అయిన వారు మనల్ని దీవిస్తూ అక్షింతలు వేస్తూ ఉంటారు. మరి అలాంటి అక్షింతలు మన నెత్తిపైన వేస్తారు.. మరి అక్షింతలు వేయడం వల్ల లాభం ఏంటి ఎందుకు వేస్తారు ఒకసారి చూద్దాం..ఏ శుభకార్యమైనా అక్షింతలతో ఆశీర్వాదం తీసుకోవడం మన భారతదేశంలో ముఖ్యమైన ఘట్టం. మరి ఆశీర్వదించే టప్పుడు అక్షింతలు ఎందుకు వాడతారో చూద్దాం..
Advertisement
బియ్యం అనేది చంద్రుడికి కారకం, చంద్రుడు మనస్సుకు కారకుడు. అదే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట. బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు అనేది శుభ గ్రహం. ఆయనకు సంకేతంగా శుభానికి సంకేతంగా, పసుపు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటు వంటిది. అకారణంచే క్షఖరం దాకా ఉన్న బీజాక్షరాలలో శక్తి ఉంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకి ఆ శక్తి వస్తుందట.
Advertisement
క్షయం లేని మంత్రాలను క్షయంలేని అక్షింతలు పట్టుకొని చదివి అవి ఎవరి తలపై వేస్తారో, వారు ఎలాంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వచనాలు పెడతారు. అలాంటి ఆశీర్వచనాలాకి శక్తి ఉంటుంది. అందుకే పుట్టినరోజులు కానీ పెళ్లి వేడుకల్లో అక్షింతలతో ఆశీర్వచనాలు తెలుపుతారు. ఇదే సంప్రదా యాన్ని పూర్వకాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు. దీన్ని ప్రస్తుత జనరేషన్ లో కూడా పాటిస్తున్నారు.
ALSO READ;
‘సిరివెన్నెల’ను చూడడానికి ఎవరిని వెళ్లొద్దని చెప్పా : మోహన్ బాబు