Advertisement
కోలీవుడ్ స్టార్ హీరోలలో సూర్య ఒకరు. తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ లలో జై భీమ్ ఒకటి. కరోనా సమయంలో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే నేషనల్ అవార్డులలో ఉత్తమ నటుడి అవార్డు సూర్యకు వస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా జడగడం గమనార్హం. అయితే ఈ సినిమాకి సూర్యకు అవార్డు రాకపోవడానికి వేర్వేరు కారణాలు జవాబుగా వినిపిస్తున్నాయి.
Advertisement
ఆకాశమే నీ హద్దురా మూవీకీ ఇప్పటికే అవార్డు వచ్చిన నేపథ్యంలో వరుసగా రెండుసార్లు ఒకే హీరోకు పురస్కారం ఇవ్వడం వల్ల టాలెంట్ ఉన్న ఇతర హీరోలకు అన్యాయం జరుగుతుందని నేషనల్ అవార్డ్స్ కమిటీ భావించి ఉండవచ్చు. థియేటర్లలో విడుదల కానీ సినిమా కావడం కూడా ఓ కారణం అయి ఉండవ్చు. అవార్డుల విషయంలో జై భీమ్ సినిమా పై ప్రభావం చూపి ఉండవచ్చని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
జై భీమ్ మూవీకి అవార్డు రానంత మాత్రాన ఈ చిత్రాన్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. హీరో సూర్యకి ఉన్న ప్రతిభకు ఈ ఏడాది అవార్డు రాకపోయినా రాబోయే రోజుల్లో అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. తనకు అవార్డు రాకపోవడం గురించి సూర్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. జై భీమ్ మూవీకి ఏదో ఒకవిభాగంలో అవార్డు వచ్చి ఉంటే బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు కొందరూ. పుష్ప మూవీకి సక్సెస్ దక్కలేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్య ప్రస్తుతం కంగువా మూవీలో నటిస్తున్నాడు.