Advertisement
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన పేర్లు ఏంటంటే టక్కునే గుర్తొచ్చేది సీనియర్ నటుడు నరేష్ – పవిత్ర లోకేష్ పేర్లే. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఓ సినిమాలో కలిసి నటించిన వీరు అనంతరం చెట్టాపట్టాలేసుకొని తిరగడం, నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి గొడవ పడడం, పవిత్ర – నరేష్ ఓ హోటల్ లో ఉండగా.. నరేష్ మూడో భార్య అక్కడికి రావడం, సోషల్ మీడియాలో ఈ రచ్చ అంతా బాగా ట్రెండ్ కావడం జరిగాయి. ఈ వ్యవహారం ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే.
Advertisement
Read also: నటిగా ఎవరూ గుర్తించలేదు.. బలగం ఫేమ్ రూప లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక 2023 నూతన సంవత్సరం సందర్భంగా త్వరలో పెళ్లి చేసుకుంటామని పవిత్ర, నరేష్ ప్రకటించడం.. ఏకంగా లిప్ కిస్ వీడియోని షేర్ చేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. ఇప్పుడు ఆ కథనంతా రియల్ ఎపిసోడ్ గా మార్చి “మళ్లీ పెళ్లి” అనే సినిమాతో నరేష్ జనాల మీదకు వదిలేందుకు సిద్ధమయ్యాడు. దీన్నంతా ఇలా సినిమాగా తీస్తారని ఎవరూ ఊహించలేదు. మరి నరేష్ అసలు ఇలా చేయడానికి కారణమేంటి అంటే..? రమ్య రఘుపతి తో తనకు విడాకులు కావాలని నరేష్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ విడాకులకు రమ్య రఘుపతి ఒప్పుకోవడం లేదు. దీంతో తన ప్రేయసి పవిత్ర లోకేష్ ని చట్టబద్ధంగా వివాహం చేసుకోవడానికి నరేష్ కు ఏ మాత్రం అవకాశం లేదు.
Advertisement
ఈ కేసు కోర్టులో ఉన్నంతవరకు ఇంతే సంగతి. దీంతో వారి జీవితాలలో ఏం జరిగిందో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నరేష్ “మళ్లీ పెళ్లి” సినిమా చేస్తున్నారు. అయితే రమ్య రఘుపతి లాగా వారి జీవితంలో జరిగిన గొడవల గురించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కన్నా ఇలా సినిమాగా చూపించడమే బెస్ట్ అని నరేష్ డిసైడ్ అయ్యారు. ఈ సినిమాతో తన భార్య తప్పు చేసిందని నరేష్ చూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవన్నీ చూసి విసిగిపోయి తన భార్య విడాకుల కోసం ఒప్పుకుంటుందనే ఆశ కూడా నరేష్ కి ఉండొచ్చు. అందుకే ఇలా “మళ్లీ పెళ్లి” అనే సినిమాతో వారి జీవితంలో జరిగిన సంఘటనలను నరేష్ తెరపైకి తెస్తున్నారని అంటున్నారు.