Advertisement
సాధారణంగా ఆంజనేయస్వామికి అమితమైన శక్తి ఉంటుంది. ఆయన శక్తి ఏంటనేది ఎదుటి వారు చెబితే తప్ప మనకు తెలియదు. ఎంతటి బలవంతుడినైనా ఎదురించి నిలవగలరు. వెయ్యి ఏనుగుల బలం ఉన్న రాక్షసుడిని చీల్చి చెండాడగలరు. సముద్రాన్ని అయినా దాటగలరు. లంకను నాశనం చేయగలరు. మన పురాణాల్లో ఆంజనేయస్వామి కంటే బలవంతుడు అని చెప్పిన వారు మరొకరు లేరు. మీకు ఓ డౌట్ రావచ్చు. మీరు పెట్టిన హెడ్డింగ్ కి ఆంజనేయస్వామికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా ? అసలు విషయంలోకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ వీరాభిమానులకు, జనసైనికులకు ఓ ముఖ్యమైన గమనిక గుర్తుంచుకోండి.
Advertisement
ఈ వార్తను తొలుత ఎందుకు ఆంజనేయస్వామితో స్టార్ట్ చేశానంటే.. పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమాన గళమెంత..? శక్తి ఎంత, బలగం ఎంత అనేది జనసేనానికి తెలియడం లేదనుకుంటా. పవన్ కళ్యాణ్ మీ బలం ఇది.. మీ శక్తి ఇది.. అని పవన్ కళ్యాణ్ కి కూడా గుర్తుంచుకుంటే బెటర్. అందుకే ఆంజనేయస్వామితో ప్రారంభించాం. ఈ మాటలు ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి గతాన్ని గుర్తుకు చేసుకోండి. 2009 సెప్టెంబర్ 02న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణించిన విషయం తెలిసిందే. వైఎస్ మరణంతో రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. వైఎస్ మరణం కేసీఆర్ కి ఓ వరంలా కలిసి వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసి తెలంగాణ సాధించుకున్నారు. రెండుసార్లు సీఎంగా పని చేశారు కేసీఆర్. మరికొద్ది రోజుల్లో మూడో సారి ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.
Advertisement
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత పవన్ కళ్యాణ్ స్పందించిన తీరును అందరూ గమనించే ఉంటారు. పవన్ కళ్యాణ్ వెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన తరువాత మీడియాతో టీడీపీ-జనసేన పొత్తు అని ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇలా చేయకుండా ఇదే అదునుగా భావించి ప్రతి పక్ష పార్టీలను సీఎం జగన్ ఇలా చేస్తున్నారని.. ఒంటరిగానే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన సత్తాను చాటితే జనసేన రేంజ్ మరోలా ఉండేది. అప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య వార్ కొనసాగుతుంటే.. పవన్ ప్రజల్లోకి వెళ్లితే మంచి ప్లస్ అయ్యేది. కానీ ఇలా పవన్ కి చాలా మైనస్ అనే చెప్పాలి. ఇప్పటికే జనసేన కు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. అభివృద్ధి ఏంటో చూపిస్తానని చెప్పిన పవన్ ఇలా వ్యవహరించడం పై సోషల్ మీడియాలో పలువురు చర్చించుకోవడం విశేషం. ఇప్పటికిప్పుడు జనసేనకు సగానికి సగం సీట్లు కేటాయించమని అడగలేరు కూడా. ముఖ్యంగా జనసేనలో పవన్ కళ్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ తప్ప జనసేన కి బలమైన నేత ఎవ్వరూ లేరనే చెప్పాలి.
వీటిని కూడా చదవండి: చెప్పిన టైం కి రానందుకు టీడీపీ టికెట్ ఇవ్వలేదట.. ఎన్టీఆర్ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆరోజుల్లో ఏమైందంటే?
పవన్ కళ్యాణ్ ఫస్ట్ పార్టీ బలాన్ని పెంచుకోవాలి. ఆ తరువాత పొత్తుల గురించి ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఓట్లు మాత్రం వేయడం లేదు. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాలు ప్రస్తుత పరిస్థితులకు సూట్ అవ్వవనే చెప్పాలి. 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019లో బీఎస్పీ, వామపక్షాలతో చేరి జనసేన పోటీ చేసింది. 2024లో టీడీపీతో కలుస్తున్నారు. పవన్ కి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదా అనే ప్రశ్నకు పవన్ వెరైటీగా సమాధానం చెప్పవచ్చు. కానీ పవన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగా పోటీ చేసి జనాల్లోకి వెళ్లితే కచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్లి ఉండేవారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఏం చేస్తే.. అటు అభిమానుల ఓట్లు, ఇటు ప్రజల ఓట్లు వస్తాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఆయన కల కలగానే మిగిలిపోతుంది. పవన్ పార్టీ గురించి ఆలోచించనంత కాలం జనసేన బలం పెరగదు. ఎప్పటికీ ఆయన సీఎం కాలేరు. ఓ అభిమానిగా తాను పవన్ కళ్యాణ్ కి సూచిస్తున్న మాట ఇది.
వీటిని కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ వ్యూహం ఏంటి ? ఎన్నికల ముందే ఇలా చేయడానికి కారణం