Advertisement
Balli sastram in Telugu: మనం సాధారణంగా నిత్యజీవితంలో కొన్ని సమస్యల నుంచి ఎలా బయటపడాలో ప్రాచీనకాలం నుంచే మన పెద్దలు,ఋషులు తెలియజేస్తూ వస్తూనే ఉన్నారు. ఆ సమస్యలకు వారు ఏనాడో పరిష్కార మార్గాలు కూడా చూపించారు. ఇందులో ముఖ్యంగా బల్లి శాస్త్రం కూడా ఒకటి. పొరపాటున మన శరీరంపై బల్లి పడితే దాన్ని అది పడిన భాగాన్ని బట్టి శుభం లేదా అశుభం అలాగే దానికి సంబంధించిన పరిహారాలు బల్లి శాస్త్రం లో ఉంటాయి.
Balli sastram in Telugu

బల్లి శాస్త్రం
బల్లి శాస్త్రం తెలుగులో
ఈ బల్లి మీద పడినప్పుడు స్త్రీ పురుషుల్లో ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా పురుషుల పై బల్లి పడితే జరిగే ఫలితాల గురించి తెలుసుకుందాం.బల్లి పురుషుల తల మీద పడితే కలహాలు ఏర్పడతాయని,అలాగే మృత్యు భయాలు వెంటాడుతాయని అంటుంటారు. అలాగే నుదుటి మీద బల్లి పడితే బంధువుల నుంచి కీడు వార్తలు వింటారు. ఒకవేళ బల్లి ముఖం మీద పడితే ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది. అదేవిధంగా బల్లి కుడి కన్ను పై పడితే జయాపజయాలు కలుగుతాయి.
Advertisement

Balli sastram in Telugu బల్లి శాస్త్రం
Balli sastram for Male and Female
ఎడమ కన్ను మీద పడితే శుభాలు కలుగుతాయి. ముక్కు మీద బల్లి పడితే అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. పురుషుల మీసం పై బల్లి పడితే కష్టాలు ఎదురవుతాయి. మెడ పై బల్లి పడితే అబ్బాయి పుడతాడు. పురుషుల ఎడమ భుజం మీద బల్లి పడితే సంఘంలో మర్యాదలు తగ్గుతాయి. బల్లి పురుషుల వీపు పైన పడితే విజయం కలుగుతుంది. బల్లి అర చేతిలో పడితే ధనలాభం కలుగుతుంది.
Advertisement
ALSO READ;
చికెన్, మటన్ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..?