Advertisement
సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే కాలుష్యం, దుమ్ము, సూర్యకిరణాల వల్ల చాలామందికి జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందిలో దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. ఈ సమస్య ఎక్కువైతే బట్టతల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా జుట్టు రాలుతోందని బాధపడేవారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.
Advertisement
గోరువెచ్చని నూనెతో మసాజ్ :జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ప్రతి రోజు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా జుట్టుకు యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ ఈ లాంటి పోషకాలు లభిస్తాయి.
Advertisement
కలబంద,పెరుగు మాస్క్ :జుట్టు ఒత్తుగా మృదువుగా తయారు కావడానికి కలబంద పెరుగు మిశ్రమం తో తయారు చేసిన హెయిర్ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ మాస్క్ క్రమం తప్పకుండా వినియోగించడం ద్వారా జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి. కాబట్టి జుట్టు సమస్యతో బాధపడేవారు తప్పకుండా ఈ మాస్క్ వినియోగించండి.
also read: తెలుగు స్టార్ హీరోల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఆవిరి పట్టించడం: జుట్టు సంరక్షించుకోవడం చాలా మంచిది. దీనికోసం టవల్ ను వేడి నీటిలో నానబెట్టి, తల చుట్టూ చుట్టండి. కాసేపు ఇలాగే వదిలేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల జుట్టు సమస్యలు దూరం అవుతాయి.
also read: నరదిష్టి ఉందా..అయితే ఇలా చేస్తే చాలు అంతా మాయం..!!