• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పవన్ ఫాన్స్ ని భలే మోసం చేసారు గా…! ఇలా కూడా చేస్తారా ? డైరెక్టర్ సాబ్ !

పవన్ ఫాన్స్ ని భలే మోసం చేసారు గా…! ఇలా కూడా చేస్తారా ? డైరెక్టర్ సాబ్ !

Published on April 9, 2023 by anji

Advertisement

గబ్బర్ సింగ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై నవీన్ యుర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా రోజులైంది. గతేడాది డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో సినిమా ఓపెనింగ్ జరిగింది. దీంతో షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ని, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నించారు.

Advertisement

READ ALSO : నాగచైతన్య పై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టిన సమంత! ఏమని ఇచ్చిందంటే?

Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh Poster Create Row in Social Media | అది డూప్‌ అంటూ రచ్చ.. పవన్ కళ్యాణ్‌ పోస్టర్ మీద కొత్త చర్చ News in Telugu

Advertisement

ఈ సినిమాని ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకి తాజాగా బుధవారం రోజు శుభవార్తను అందించారు దర్శకుడు హరీష్ శంకర్. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో ప్రారంభం అయింది. పది రోజుల పాటు సాగే ఈ చిన్న షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో హాజరయ్యాడు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ మరియు పోలీస్ ఆఫీసర్ రెండు పాత్రలలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా హరీష్ శంకర్ ఓ చిన్న పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది.

Pawan Kalyan-Harish Shankar's concept poster is out

ఇందులో పవన్ కళ్యాణ్ కుర్చీ వెనకకి తిప్పి కూర్చుని ఒక చేతిలో టీ గ్లాస్, మరో చేతిలో గన్ పట్టుకొని ఉన్నాడు. వెనకనుంచి తీసిన ఫోటోని పోస్టర్ తో రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ పోస్టర్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదని, డైరెక్టర్ హరీష్ శంకర్ అని, ఫేక్ ఫోటోతో అభిమానులను మోసం చేయాలనుకుంటున్నారా అంటూ హరీష్ శంకర్ ని, మైత్రి నిర్మాణ సంస్థని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు, నేటిజెన్లు. ఈ పోస్టర్ ని బాగా గమనించి చూస్తే అచ్చం హరీష్ శంకర్ ని వెనకనుంచి చూసినట్టే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం పవన్ ని కొత్త లుక్ లోకి మార్చారా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ అప్డేట్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

READ ASLO : ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని టాలీవుడ్ సెలెబ్రెటీల 25 +పెళ్లి ఫోటోలు !

 

Related posts:

“నువ్వు నాకు నచ్చావు” ఛాన్స్ మిస్ చేసుకున్న నటులు వీళ్లే! తాళిబొట్టు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న పూరి జగన్నాథ్ పెళ్లి చేసిన నటి యాంకర్ ఎవరో తెలుసా..? Das ka Dhamki OTT Release Date, OTT Platform, Digital Rights రాధే శ్యామ్ మూవీ లో ఈ సీన్ గమనించారా..? నిజంగా గ్రేట్..!!

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd