Advertisement
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచే అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడుకు సంబంధించిన ఇల్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి సన్నిహితుల నుంచి ఐటి అధికారులు, భారీగా డబ్బు సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే సుచిత్రాలో త్రిశూల్ రెడ్డి ఇంట్లో రెండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు.
Advertisement
తాజాగా మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రఘునాథ్ రెడ్డి వద్ద రూ.2 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు లో రఘునాథ్ రెడ్డి నివాసం ఉంటున్నారు. రఘునాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి రెండు కోట్లకు పైగా డబ్బు సీజ్ చేశారు. మరోవైపు జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డు లో మల్లారెడ్డికి వరుసకు అల్లుడు అయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి ఐటి అధికారులు వెళ్లారు. అయితే సంతోష్ రెడ్డి తలుపు తీయకపోవడంతో అధికారులు వేచి చూస్తున్నారు. డోర్ పగలగొట్టి లోపలకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Advertisement
ఐటి దాడులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సీట్ల భర్తీపై అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కన్వీనర్ కోటకి బదులు ప్రైవేట్ వ్యక్తులకు కోట్లకు సీట్లు అమ్ముకున్నారని అర్వింద్ ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నట్టుగా అర్వింద్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. మల్లారెడ్డి తన నివాసం పక్క క్వార్టర్స్ లో జూట్ బ్యాగులో పెట్టిన సెల్ ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.
ALSO READ ; అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?