Ads
ఈటీవీ లో ప్రసారమౌతున్నటువంటి జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటే తెలియని వారు ఉండరు అని చెప్పవచ్చు. ఈ షో ఎంత పాపులర్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. అందులో ఒకరు ఫేమస్ కమెడియన్ నరేష్. నరేష్ వేసిన పంచులు కానీ కామెడీ టైమింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ భాస్కర్ టీమ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కమెడియన్ నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అవేంటో తెలిస్తే మీరు కూడా బాధపడతారు..?
Also Read: చిరంజీవి వర్సెస్ బాలయ్య…ఒకేసారి విడుదలైన వీరిద్దరి సినిమాలు ఇవే!
Jabardasth Naresh age
వరంగల్ జిల్లాలోని జనగామ సమీపంలోని అనంతపురం అనే గ్రామంలో పుట్టి పెరిగాడు నరేష్. చిన్నతనం నుంచే ఎదుగుదల లోపంతో చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు. కానీ ఆ లోపమే ఆయనకు ఇప్పుడు ఒక వరంగా మారిందని అన్నారు. 22 సంవత్సరాల వయసు ఉన్నా కానీ పదేళ్ల పిల్లాడిలా కనిపించే నరేష్ , 2000 సంవత్సరంలో పుట్టాడు. అతనికి డాన్స్ అంటే చాలా ఇష్టమట దీనిపై ఉన్న ఇష్టం తోటే ఈటీవీ లోని ఢీ షో కు సెలక్ట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఆయన నటనా ప్రస్థానం మొదలై పోయింది. ఢీ షో జూనియర్స్ లో ఎంట్రీ ఇచ్చిన నరేష్ దశ తిరిగిపోయింది. ఒకరోజు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ బయట ఉన్నటువంటి నరేష్ ను సునామి సుధాకర్ చూసి పరిచయం చేసుకున్నారు. తర్వాత చలాకి చంటి టీమ్ లో జాయిన్ చేశారు.
Advertisement

Jabardasth Naresh age
ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి ఈ విధంగా జంప్ అవుతున్న నరేష్ జీవితమే మారిపోయింది. జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా ఎదిగారు ఆయన. జబర్దస్త్ లోకి వచ్చాక నరేష్ తన ఊర్లో ఒక ఇల్లు కూడా కట్టుకున్నారు. అలాగే సిటీ లో ఒక ఫ్లాట్ కొన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయనకు అనేక ఇబ్బందులు ఉన్నాయట. అతనికి ఉన్నటువంటి ఎదుగుదల లోపం సమస్య నయం అయ్యే పరిస్థితి లేదని, ఒకవేళ ఆ విధంగా ప్రయత్నించిన చాలా ఖర్చుతో కూడుకున్న పని అని వైద్యులు చెప్పారని నరేష్ తెలియజేయడం బాధాకరం. ఇన్నాళ్లు జబర్దస్త్ కామెడీ లో మనందరి నటించిన నరేష్ జీవితంలో ఇంతటి కష్టం ఉందని తెలిసిన అతని ఫ్యాన్స్ కంటతడి పెడుతున్నారు.
Also read: జానకి రాముడు’ To ‘రేసుగుర్రం’ ఎడిటర్ గౌతమ్ రాజు కెరిర్ లో బెస్ట్ మూవీస్ ఇవే!