Ads
హీరో ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక ఊపు ఊపిన హీరో ఉదయ్ కిరణ్.. ఇండస్ట్రీలో ఆయన ఎంత తొందరగా స్టార్డం తెచ్చుకున్నారో అంతే తొందరగా తన సినీ కెరీర్లో డల్ అయిపోయారు.. చివరికి ఎలాంటి ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య కూడా చేసుకుని మరణించారు.
ఆయన చనిపోయి ఇప్పటికి పది సంవత్సరాలు అవుతున్నా అభిమానులు మాత్రం ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. హీరో ఉదయ్ కిరణ్.. సినిమాలు ఇప్పుడు వచ్చినా.. చాలా మంది ఎగబడి చూస్తూ ఉంటారు. అయితే.. ఉదయ్ కిరణ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు నరేష్. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు హీరో నరేష్ ఆయనను కలిశాడట. అప్పుడు ఉదయ్ కిరణ్ డల్ గా కనిపించారట.
Advertisement
దాంతో ఎందుకు ఉదయ్ అలా డల్ గా కనిపిస్తున్నావు అని ప్రశ్నించగా, పేపర్లో యంగ్ హీరో కథలు సరిగ్గా ఎంచుకోవడంలేదని రాశారని ఆవేదన వ్యక్తం చేశాడట. దానికి నరేష్ ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు, నీకు సంబంధించిన విషయం కాదు కదా అని అన్నారట. దాంతో ఉదయ్ కిరణ్ ఆ యంగ్ హీరో కథలు సరిగ్గా ఎంచుకోకపోతే అతడికి కూడా ఉదయ్ కిరణ్ కు పట్టిన గతే పడుతుందని ఆ పేపర్లో రాశారని బాధపడ్డాడట. దాంతో నరేష్, ఉదయ్ కిరణ్ ని చూసి ఉద్వేగానికి గురయ్యారట. ఆ విషయంతో ఉదయ్ కిరణ్ ఎంతో డిప్రెషన్ లో ఉన్నాడని నరేష్ కి అర్థమైందట. ఇక ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత అతడి మృతికి డిప్రెషన్ కూడా కారణమని నరేష్ కు అనిపించిందని ఇంటర్వ్యూలో తెలిపాడు.
READ ALSO : వాటర్ ట్యాంక్‌పై ఈ పైప్ ఎందుకు ఉంటుందో తెలుసా ?