Advertisement
Jabardasth New Anchor sowmya Rao: తెలుగు టెలివిజన్ చరిత్రలో “జబర్దస్త్” కామెడీ షోకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జడ్జిలు, కంటెస్టెంట్లు మారినా కూడా ఈ షో రేటింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎందరో కమెడియన్స్ ని పరిచయం చేసింది ఈ బుల్లితెర నవ్వుల షో. ఈ షోలో చేసిన వారిలో చాలామంది సిల్వర్ స్క్రీన్ పై సైతం రాణిస్తున్నారు. అయితే ఈమధ్య కొద్దిరోజుల నుండి ఈ షో నుండి జడ్జిలు, యాంకర్లు, అలాగే కమెడియన్లు కూడా ఒక్కరొకరిగా వెళ్ళిపోతున్న విషయం తెలిసిందే. ఈమధ్య అనసూయ జబర్దస్త్ మానేయడం పెద్ద న్యూస్ అయింది. ఇక అనసూయ వెళ్ళిపోయాక అటు జబర్దస్త్, ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి రష్మీ గౌతమ్ నే యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
Read also: సినిమాల్లోకి బన్నీ భార్య, ఆ స్టార్ హీరో మూవీతో ఎంట్రీ అంటూ వార్తలు!
Advertisement
Jabardasth New Anchor sowmya Rao
తాజాగా ఈమెకు ఈ షో నిర్వాహకులు అనుకోని షాక్ ఇచ్చారు. రష్మీ గౌతమ్ స్థానంలో కొత్త యాంకర్ ని తీసుకున్నారు. రష్మీ ని ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ ఒక్కదానికే పరిమితం చేశారు. అయితే ఈ కొత్త యాంకర్ ఎవరో కాదు.. సౌమ్య రావు. ఈమె పూర్తి పేరు.. సౌమ్య శారద. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ ఈమె సొంత ఊరు. ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ యాక్టర్. అయితే ఈమె ఇటీవల జరిగిన ఈటీవీ 27 వ యానివర్సరీ ఈవెంట్ లో సౌమ్య హైలైట్ అయ్యారు. ఈ ఈవెంట్లో హైపర్ ఆది ప్తె వరుస పంచ్ లు వేసి అందరి కంట్లో పడ్డారు. ఇప్పుడు ఈమెని జబర్దస్త్ కి యాంకర్ గా తీసుకోవడానికి ఇది కూడా ఓ కారణం.
అయితే రష్మీ లాగా ఈమెకి కూడా తెలుగు సరిగా మాట్లాడడం రాదు. కానీ ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో కొత్త యాంకర్ సౌమ్యరావు పై హైపర్ ఆది, కృష్ణ భగవాన్ పంచులు.. వాటికి ఆమె ఇచ్చిన కౌంటర్స్ ప్రేక్షకులను నవ్వించాయి. మంచి హైట్, కలర్, సూపర్ గ్లామరస్ గా ఈ కొత్త యాంకర్ ఉందంటూ ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ లోనే తన మార్క్ చూపించింది సౌమ్యారావు. గతంలో ఇద్దరు జబర్దస్త్ యాంకర్స్ గా వచ్చి సక్సెస్ కాక మధ్యలోనే వెళ్లిపోయారు. మరి ఈమె ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియాల్సి ఉంది.