Advertisement
Jabardasth Anchor Sowmya Rao Remuneration: బుల్లితెరపై ఎన్నో సంవత్సరాలుగా అలరిస్తున్నటువంటి కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది వారి టాలెంట్ నిరూపించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హోదాలో కొనసాగుతున్నారు. అలాగే ఈ షోలో కొన్ని రోజుల వరకు యాంకర్ గా అనసూయ, నిన్నటి వరకు యాంకర్ రష్మీ .. ప్రస్తుతం యాంకర్ సౌమ్యారావు వచ్చారు. జబర్దస్త్ లో ఈ మార్పులు అనేవి చకచకా జరిగిపోతున్నాయి. వీరితో పాటుగా యాంకర్లు, కంటెస్టెంట్లు, జడ్జీలు మారుతూ ఉండడం మనం చూసాం.
Advertisement
jabardasth anchor sowmya rao remuneration
also read: ఉదయ్ కిరణ్ మరణానికి చిరంజీవికి సంబంధం లేదు.. తేల్చి చెప్పిన తేజ..!
అయితే రీసెంట్ గా జబర్దస్త్ షో ద్వారా మంచి ఫామ్ లో ఉన్నటువంటి యాంకర్ రష్మిని పక్కన పెట్టేసి సీరియల్ ఆర్టిస్ట్ అయినటువంటి సౌమ్యరావు ను జబర్దస్త్ యాంకర్ గా పరిచయం చేశారు నిర్వాహకులు. అంతేకాకుండా కొత్త యాంకర్ తో ప్రోమో కూడా రిలీజ్ చేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్ గా సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చేసరికి ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదివరకు ఏం చేసింది? అనేది తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నెటిజన్స్. సౌమ్యా రావు గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా శ్రీమంతుడు సీరియల్ చూసేవారికి ఈమె బాగా గుర్తుండే ఉంటుంది.
Advertisement
jabardasth anchor sowmya rao images
కర్ణాటక కు చెందినటువంటి ఈ అమ్మడు న్యూస్ రీడర్ గా కెరియర్ ప్రారంభించి కొన్నేళ్లుగా సీరియల్స్ లో స్థిరపడిపోయింది. కన్నడ తో పాటు తమిళ,తెలుగు సీరియల్స్ లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ తరుణంలోనే ఆమె రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఎపిసోడ్ కు ఎంత తీసుకుంటుంది? అనే విషయంపై చర్చిస్తున్నారు. అయితే సౌమ్య రావు ఒక్కో ఎపిసోడ్ కి 85000 తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సౌమ్య యాంకరింగ్, గ్లామర్ తోడై ఈ షో కి మంచి రేటింగ్ వస్తే మాత్రం ఆమె పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు సినీ విశ్లేషకులు.
also read: