Advertisement
ఈసారి జరిగిన ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అంత చిక్కట్లేదు. తాను మంచి చేసానని అయినా ఫలితం ఇలా రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఫలితాలు తర్వాత తాను ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారో పార్టీ నేతలకు చెప్పారు ఆ సమయంలో జగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి.
Advertisement
ఎన్నికల ఫలితాల షాక్ నుండి జగన్ కోలుకోలేదు. తనను కలిసిన పార్టీ నేతల వద్ద ఫలితాలు గురించే ఆయన మాట్లాడుతున్నారట. తను ఫలితాలు చూసి షాక్ అయ్యానని అన్నారు. ఇంత చేస్తే ఫలితం ఇలా వచ్చింది ఏంటని అన్నారట. అసలు అన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనిపించింది అని జగన్ పార్టీ నేతలతో చెప్పారు. ఫలితాల షాక్ నుండి బయటకు రావడానికి రెండు మూడు రోజులు పైనే పట్టిందని పార్టీ నేతలకు చెప్పారట.
Advertisement
Also read:
నిజంగా వెళ్ళిపోదామని అనిపించిందని కానీ వచ్చిన ఓట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో సీటు రాకపోయినా 40% ఓట్లు పార్టీకి వచ్చాయని, దీని ద్వారా అంత పెద్ద సంఖ్యలో జనం మన మీద నమ్మకం పెట్టుకున్నారని, అది చూశాకనే మనం నిలబడాలని మనకు ఓట్లు వేసిన జనం కోసం పనిచేయాలని జగన్ అన్నారు. అలాగే జనం కోసం ముందు నిలబడాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. సర్వేలు చేయించామని వాటిలో కూడా వ్యతిరేకత రాలేదని అన్నారు సర్వేలతో కాన్ఫిడెన్స్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయని జగన్ అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!