Advertisement
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బలం ఆయన అభిమానులే. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో తనని నడిపించే శక్తి వారి అండదండలేనని అంటున్నారు. అయితే.. ఆయన 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఓ అభిమాని రాసిన లేఖని పంచుకున్నారు. నిబద్ధతతో కూడిన జనసైనికుల మద్దతు, పట్టుదలే తనను కష్ట సమయాల్లో కొనసాగిస్తున్నాయని పవన్ అన్నారు. వారిని స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు.
Advertisement
వీటిని చదవండి : సానియా మీర్జా కి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్ ! అమ్మాయి ఎవరంటే?
ఈ లేఖను పంచుకుంటూ పవన్ ఇలా చెప్పుకొచ్చారు, “ఈ లేఖతో కింది గ్రూప్ లీడర్ ఆగలేదు, అతను స్థానిక సంస్థల ఎన్నికల కోసం ‘యుఎస్’ నుండి దిగి వచ్చి అభ్యర్థిని నిలబెట్టి, రామన్న పాలెం MPTC స్థానం, ఆచంట నియోజకవర్గం మరియు ఆచంట నియోజకవర్గం మరియు గెలిచి చిన్న విజయం సాధించాడు. 144 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అని పవన్ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ లేఖలో ఏమి రాసి ఉందొ ఇప్పుడు చూద్దాం. నా దేశాన్ని వదిలి.. విదేశాల్లో అవమానాల్లో ఆనందాన్ని వెతుక్కునే నాలాంటి వాళ్ళెందరికో ఒక్కటే నీ మీద ఆశ.
Advertisement
వీటిని చదవండి : Sarayu Riverin Ayodhya: అయోధ్యకు వెళ్తున్నారా? అయితే సరయు నదిలో తప్పక స్నానం చేయండి.. ఎందుకంటే?
ఎక్కడో బొలివియా అడవుల్లో అంతమైపోయిన విప్లవానికి నాంది ఒకటి కనిపెట్టకపోతావా? అని. సరికొత్త గొరిల్లా వార్ ఫర్ ని కనిపెట్టలేకపోతావా? అని. మన దేశాన్ని, కనీసం మన రాష్ట్రాన్ని అయినా మార్చుకోలేకపోతామా? అని. దాదాపు పదిహేడేళ్ళుగా దేశంలో లేకపోయినా… దేశ పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్లంతా.. మా కోసం నిలబడే నీ కోసం బలపడతాం. కారు మీదకి ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా.. కారు కూతలు కూసేటోల్లని పట్టించుకోకన్నా. కారుమబ్బులు కమ్ముతున్నా..నువ్వు కార్యోన్ముక్తుడివి అయితే.. ఆ మహా శక్తీ నీకు అండగా ఉంటుందన్నా. కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ గురించి నువ్వు చెప్పినప్పుడే నిన్ను హీరోగా చూడడం మానేసాను. రాష్ట్రాన్ని ప్రగతి పథంవైపు నడిపించే నాయకుడివి నువ్వు.. అంటూ ఐర్లాండ్ నుంచి ఓ ఓడ కళాసీ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీటిని చదవండి : పవన్ కి శత్రువు.. తనకి మిత్రుడు.. ఆయనపై పోటీ చేయడానికి ముద్రగడ ఒప్పుకుంటాడా? టీడీపీ ప్లాన్ అదేనా?
 





