Advertisement
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మరి కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. తన సంక్షేమ పధకాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మరోసారి అధికారం కట్టబెడతారు అని సీఎం జగన్ భావిస్తున్నారు. మరో వైపు టీడీపీ-జనసేన కూడా పొత్తు పెట్టుకుని తామే గెలుస్తామని ఆశాభావంతో ఉన్నాయి. సీట్ల పంపకం కూడా అన్ని పార్టీలలోనూ తుది దశకు చేరుకుంది. ఇక జనసేన, టీడీపీ పార్టీల్లో కూడా ఈ పని పూర్తి కావొస్తోంది. బీజేపీ నిర్ణయం తెలిసాకే ఈ రెండు పార్టీలు అధికార ప్రకటన చేస్తాయి.
Advertisement
మరోవైపు జనసేనాని కూడా పొత్తు కు సహకరిస్తూనే.. పట్టు బిగించే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 20 నుంచి 25 సీట్లు వస్తాయని ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు పవన్ కళ్యాణ్ నలభై సీట్లకు తగ్గకుండా తీసుకునే ప్రయత్నం చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని రోజుల క్రితం నారా లోకేష్ సీఎం పదవి షేరింగ్ అన్న ఆలోచన లేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అయితే పవన్ తన ఆలోచనలను మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్యతో పంచుకున్నారట.
Advertisement
ఆయన ఈ విషయమై రాసిన లేఖలో.. రాబోయే ఎన్నికల్లో 40-60 సీట్లు దక్కించుకోవాలని తానూ సూచించినట్లు పేర్కొన్నారు. పవన్ ను సీఎం గా చూడాలని జన సైనికులు భావిస్తున్నారన్న విషయాన్నీ కూడా వెల్లడించామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఒకే త్రాటిపై వెళ్లేట్లుగా చర్చలు జరిపామన్నారు. రెండున్నరేళ్ల పాటు పవన్ ను సీఎంగా ప్రకటిస్తేనే పొత్తులో ఓట్ల బదిలీ సాధ్యం అవుతుంది అని జోగయ్య స్పష్టం చేసారు. జనసైనికుల గౌరవానికి భంగం వాటిల్లకుండా జనసేన పార్టీ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం లలో ఒక చోట నుంచి పోటీ చేయాలనీ జోగయ్య పవన్ కళ్యాణ్ ను కోరారు. ఈ లెక్కన రెండున్నర ఏళ్ల సీఎం పదవి, నలభై సీట్లు ఒప్పుకుంటేనే పొత్తు సాధ్యమని జనసేన కండిషన్స్ పెట్టె అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీటిని చంద్రబాబు ఒప్పుకుంటారా? అన్న సంగతి తెలియాల్సి ఉంది.
Read More: