Advertisement
ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీలు చాలా బిజీ గా ఉంటాయి. అయితే.. ఏ రాజకీయ పార్టీకి అయినా ఈ సమయంలో డబ్బు అవసరం ఉంటుంది. అయితే.. ఇటువంటి సమయంలో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ తమకు విరాళంగా వచ్చిన డబ్బుల్ని కూడా వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు, వ్యాపారాలు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తుండడం ఎప్పటినుంచో జరుగుతున్నదే. అయితే.. ఇలా జనసేన పార్టీకి కూడా విరాళాలు వస్తున్నాయట.
Advertisement
కానీ విరాళం ఇచ్చిన తరువాత వారు ప్రతిఫలం ఆశిస్తున్నారట. తమకు పార్టీలో సీట్ కావాలి అని అడుగుతున్నారట. విరాళాల పేరుతో సీట్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారట. దీనితో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎవరైతే టికెట్స్ అడుగుతున్నారో వారి చెక్స్ ని వెనక్కి పంపమని పవన్ ఆదేశించారట. ఎప్పుడు ప్రజల మధ్య లేకుండా ఎలక్షన్స్ సమయానికి చెక్స్ విరాళంగా ఇచ్చి సీటు కోసం ఆశపడుతున్న వారికి పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల వేళ పార్టీకి చాలా ఖర్చులు ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో కూడా పవన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి.
Advertisement
పార్టీ వ్యవహారాలను చూసుకునే అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఒక్క మంగళ వారం రోజే ఏడు చెక్ లను వెనక్కి పంపినట్లు తెలుస్తోంది. ఇంకా కొందరు విరాళాలు ఇచ్చి సీటు ఆశిస్తున్నా వారికి కూడా చెక్ వెనక్కి పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో పార్టీ శ్రేణులు, ప్రజలు, ప్రముఖుల్లో సీట్లు ఆశించని వారి నుంచి మాత్రమే విరాళాలు తీసుకోమని పవన్ ఆదేశించారు. ఓ వైపు జనసేన-టీడీపీ కూటమికి సీట్లు సర్దుబాటు కాకుండానే మరో అంశం తెరపైకి వచ్చింది. అదే బీజేపీ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం. ఇటు టీడీపీ తోనూ, అటు బీజేపీ తోనూ జనసేన స్నేహంగానే వ్యవహరిస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పొత్తుకు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్చకు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ కూడా పొత్తుకు సిద్ధమైతే.. సీట్ల సర్దుబాటు గురించి మరోసారి చర్చ జరపనున్నారు.
Read More:
శ్రీమంతుడు కథ కాపీ వివాదం నుంచి నమ్రత మహేష్ ని తెలివిగా ఆలా తప్పించేసారా ?
1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హరి కృష్ణ కి జరిగిందే మళ్ళీ షర్మిల కి జరగబోతుందా ?
యాత్ర 2 సినిమాలో షర్మిల, లోకేష్, పవన్ క్యారెక్టర్లని ఎందుకు పెట్టలేదో తెలుసా ?