Advertisement
Japan Movie Review: జపాన్ సినిమాలో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు నటించారు. రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు ఈ సినిమాని నిర్మించారు. జి వి ప్రకాష్ సంగీతాన్ని అందించారు.
Advertisement
Japan Movie Review
చిత్రం : జపాన్
నటీనటులు : కార్తీ, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, విజయ్ మిల్టన్ తదితరులు
దర్శకత్వం : రాజు మురుగన్
సంగీతం: జి వి ప్రకాష్
నిర్మాత : ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు
విడుదల తేదీ : నవంబర్ 10, 2023
Japan Movie Story/జపాన్ కథ మరియు వివరణ:
ఇక జపాన్ ట్రయిలర్ ని చూస్తే.. చాలా కొత్తగా ఉంది. ఈ మూవీ కథ బాగా సింపుల్ గా ఉన్నట్టు వుంది, దాని సెటప్, నేపథ్యం మాత్రం చాలా కొత్తగా ఉంది. కార్తీ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా వుంది. డిఫరెంట్ మేనరిజమ్స్ తో కార్తీ అదరకొట్టేసాడు. అలానే, ఈ మూవీ ట్రయిలర్ లో చూస్తే కార్తీ చెప్పిన డైలాగ్స్ సూపర్ అసలు. కార్తి ఇష్టపడే అమ్మాయి పాత్రలో అను ఇమ్మాన్యుయేల్ నటించి బానే తన పాత్రకి న్యాయం చేసినట్టే కనపడుతోంది. సునీల్, విజయ్ మిల్టన్, తదితరులు కూడా పాత్రకి న్యాయం చేసినట్టే వుంది. ఎస్ రవి వర్మన్ క్యాప్చర్ చేసిన విజువల్స్ కూడా సూపర్ అసలు. జివి ప్రకాష్ కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కూడా వర్క్ అవుట్ అయ్యాయి. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ మూవీ ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది.
Advertisement
ఇక కథ విషయానికి వస్తే, జపాన్ ( కార్తీ ) చిన్నప్పటి నుంచి కూడా పొట్టకూటి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉండేవాడు. దొంగగా మారిన జపాన్ ఎన్నో దొంగతనాలు చేసాడు. అందులో భాగంగానే ఆయన కి ఒక బిగ్ డీల్ కుదురుతుంది. మినిస్టర్ ఇంట్లో డబ్బులు కొట్టేయాలనమాట. అందుకు ఒప్పుకుని జపాన్ మంత్రి ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఆ టైం కి ఆ ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఈ మర్డర్ చేసింది జపాన్ అని అనుకున్న పోలీసులు జపాన్ కోసం వెతుకుతారు. దొంగతనం చేయడానికి ఆ మర్డర్ కి ఉన్న సంబంధం ఏంటి..? అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు..? కావాలనే జపాన్ ని ఇరికించారా అనేది తెలియాలి అంటే సినిమాని చూడాలి.
కార్తీ ఎప్పుడు కూడా డిఫరెంట్ గా వున్నా కథలను ఎంచుకుంటాడు. ఇప్పుడు వచ్చిన జపాన్ మూవీ కూడా డిఫరెంట్ గా వుంది. ఒక రాబరీ స్టోరీని తీసుకొని ఎమోషన్ ని జోడించి కొత్త సినిమాని తెరమీదకి తీసుకు వచ్చాడు. జోకర్ సినిమా ఫేమ్ తెచ్చుకున్న రాజమురుగన్ సూపర్ గా మూవీ ని తీసుకు వచ్చాడు. కార్తీ నటించిన కొన్ని సీన్లు అయితే హైలెట్ అయిపోయాయి. కార్తీ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని బాగా తీశారు. రాజు మురుగన్ ఒక అద్భుతమైన ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే రాశారు. స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా సస్పెన్స్ పెట్టారు. కామెడీ తో వుంది, పైగా సస్పెన్స్ ఎక్కడ కూడా రివిల్ చేయలేదు. బిజీయం నెక్స్ట్ లెవెల్ లో వుంది.
ప్లస్ పాయింట్స్:
కార్తీ నటనలో వేరియేషన్స్
కామెడీ
స్క్రీన్ ప్లే , డైరెక్షన్
బిజీయం
నెగిటివ్ పాయింట్స్:
రొటీన్ కథ
పాటలు
కొన్ని ల్యాగ్ సీన్స్
రేటింగ్ 2.75/5
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!