Advertisement
యాత్ర 2 సినిమా ఈ నెల ఎనిమిదవ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా వై ఎస్ జగన్ బయోపిక్ గా రూపొందింది అన్న సంగతి అందరికి తెలుసు. ఓ వైపు ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్న క్రమంలో ఈ సినిమా యూనిట్ కూడా ప్రమోషన్స్ ను గట్టిగానే చేస్తోంది. ఈ ప్రమోషన్స్ సందర్భంగా ఈ సినిమాలో సీఎం జగన్ గా నటించిన జీవా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ముమ్ముట్టి తనతో చెప్పిన విషయాలను జీవా ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆనందం సినిమా కోసం 2001 సంవత్సరంలో మమ్ముట్టిని కలిశానని.. మళ్ళీ తిరిగి 20 సంవత్సరాల తరువాత యాత్ర 2 సెట్స్ లో కలిశానని అన్నారు.
Advertisement
మమ్ముట్టి చాలా సరదా మనిషి అని చెప్పుకొచ్చిన జీవా.. ఆయనను సెట్స్ లో ఉన్నప్పుడు తాను అడిగిన ప్రశ్న గురించి చెప్పుకొచ్చారు. యాత్రలో వై ఎస్ ఆర్ పాత్రను పోషించినప్పుడు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదా? అని అడిగానని.. దానికి సమాధానంగా ఆయన ఏమి సమస్యలు వస్తాయి? మనం కేవలం నటులము మాత్రమే. మనం ఎవరి పాత్రనైనా పోషిస్తే.. ఆ పాత్రకి మనం మద్దతు ఇచ్చినట్లు కాదు అని ఆయన చెప్పారన్నారు. ఇదే అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తానని.. మమ్ముట్టి అభిప్రాయమే నా అభిప్రాయం కూడా అని జీవా చెప్పుకొచ్చారు.
Advertisement
వచ్చిన అవకాశాలు అందుకుంటూ ముందుకు వెళ్ళమని మమ్ముట్టి తనకు సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. దీనితో నెటిజన్స్ ఈ వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. ఇదేందయ్యా జీవా ఇలా అనేసావ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిన యాత్ర 2 సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాత్ర 2 సినిమా అప్ డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.
Read More:
ప్రశాంత్ వర్మ జీవితం లో ఈమె చాలా స్పెషల్ ! ? దర్శకుడు అవ్వకముందు ఏ ఉద్యోగం చేసేవారంటే ?
వాడు 80 కోట్లు కొట్టేయడం వల్లే రోడ్డున పడ్డాం.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరి జగన్నాథ్ తల్లి!