Advertisement
గాజువాకకు చెందిన లేడి కండక్టర్ ఝాన్సీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు లేడీ కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్ కనిపిస్తోంది. ఈ అమ్మడు తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో పల్సర్ బైక్ పాట చేసింది. కేవలం ఒక్క పాటకు డాన్స్ చేసి ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది. అంతే కాదండోయ్, ఇంటర్నెట్ లో ఆర్టీసీ ఝాన్సీగా గుర్తింపు సంపాదించుకుంది.
Advertisement
ఝాన్సీ ప్రస్తుతం గాజువాక బస్సు డిపోలో కండక్టర్ గా పనిచేస్తూ డాన్స్ పెర్ఫార్మెన్స్ లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యక్తిగత జీవితం గురించి డాన్స్ కోసం ఆమె కష్టాలను తెలుసుకొని ఎంతో మద్దతుగా నిలుస్తున్నారు. ఇక తాజాగా కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్ కు హీరో సంపూర్ణేష్ బాబు ఫిదా అయ్యాడు. ఆమె గురించి తెలుసుకొని ప్రత్యేకంగా ఫోన్ చేశాడు. తన సినిమాలో ఐటమ్ సాంగ్ లో డాన్స్ వేయాలని చెప్పాడు.
Advertisement
స్వయంగా సినీ హీరో ఫోన్ చేయడంతో ఝాన్సీ తెగ ఆనంద పడిపోతుంది. సినిమా ఆఫర్ రావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె ఇన్నాళ్లు పడ్డ కష్టానికి ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయని నేటిజెన్లు అంటున్నారు. గాజువాక డిపో కండక్టర్ గా 11 ఏళ్లుగా పనిచేస్తోంది. ఝాన్సీ డాన్స్ పర్ఫామెన్స్ లు ఇస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. తమ్ముడిని ఎంబీఏ చదివించింది. స్టేజ్ లపై డ్యాన్సులు వేయడంతో ఎంతోమంది రకరకాల మాటలు అనుకున్న, కుటుంబం కోసం అన్ని భరించింది.
Read Also : Shakini Dakini Movie Review :శాకినీ డాకిని మూవీ రివ్యూ