Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్నటువంటి బెస్ట్ కపుల్స్ లో ఎన్టీఆర్ లక్ష్మీప్రణతి దంపతులు మొదటి స్థానంలో ఉంటారు.. ఎన్టీఆర్ ఫ్యామిలీ కి తగ్గట్టుగా లక్ష్మీప్రణతి వచ్చిందని చాలామంది అంటూ ఉంటారు.. అయితే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహం 2011 మే 6వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది.. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతి. ఈ సంబంధాన్ని చంద్రబాబునాయుడే చూశారని అప్పట్లో ప్రచారం కూడా సాగింది. చూడడమే కాకుండా దగ్గరుండి పెళ్లి కూడా జరిపించారని వార్తలు వచ్చాయి.. మరి ఆ సమయంలో ఎన్టీఆర్ కు భరణం కింద ఎంత ఇచ్చారు.. అప్పట్లో వీరి పెళ్ళి పై జరిగిన రచ్చ ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read; మెగాస్టార్ చిరుకి 30 ఏళ్లుగా డూప్ గా చేస్తున్న వ్యక్తి ఎవరంటే..!!
Advertisement
ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల వివాహ సమయంలో లక్ష్మీప్రణతి కుటుంబం ఎన్టీఆర్ కు దాదాపుగా 250 కోట్ల విలువైన భూములు ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అంతేకాకుండా ఇంకా కొన్ని ఆస్తులు కూడా రాసి ఇచ్చారట.. ఇవన్నీ కలిపితే మొత్తం ఎన్టీఆర్ కు 1200 కోట్ల వరకు నార్నె శ్రీనివాసరావు ఇచ్చారని సమాచారం. అయితే వీరి వివాహ సమయంలో వయసు గురించి ప్రధానంగా చర్చ సాగింది. ఎన్టీఆర్ చాలా చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంటూ ఎన్టీఆర్ అంటే పడని కొంతమంది ప్రచారం చేశారు.. ఆయన మైనర్ బాలిక ను వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం విపరీతంగా జరిగింది.. ఇందులో అసలు నిజం ఏంటంటే లక్ష్మీప్రణతి వివాహం కాకముందే మేజర్ అయింది.. ఎన్టీఆర్ మైనర్ ను వివాహం చేసుకోలేదు.
చట్ట ప్రకారమే వీరి వివాహం జరిగింది.. కానీ ఎన్టీఆర్ అంటే పడని కొంతమంది ఇలా తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని తర్వాత ఎంక్వైరీ లో తేలింది.. ఏది ఏమైనా వీరి వివాహం చేసుకున్న తర్వాత ఎలాంటి కల్మషాలు లేకుండా 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలోనే ఎంతో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్నారు.. వీరికి ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు.. ఇవన్నీ పక్కన పెడితే ఎన్టీఆర్ ను అర్థం చేసుకునే మంచి భార్య దొరికిందని చాలామంది అంటుంటారు. ఎన్టీఆర్ ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఆయనకు తోడుగా నిలబడి ధైర్యాన్ని అందించే వదినమ్మ దొరికింది అంటూ అభిమానులు కూడా సంతోషిస్తారు.
also read: విజయనిర్మలకు నరేష్ కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నారా..?