Advertisement
మునుగోడులో ఎవరికి వారు ఓటర్లకు క్రీమ్ బిస్కెట్లు ఇచ్చే పనిలో ఉన్నారు. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా జోరుగా గ్రామాల్లో తిరుగుతున్నారు. మిగిలిన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు సైతం తమదైన స్టయిల్ లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారిలో కేఏ పాల్ ఒకరు.
Advertisement
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ.. అభ్యర్థి చివరి నిమిషంలో సైడ్ అవ్వడంతో రంగంలోకి దిగారు పాల్. నామినేషన్ వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ హోటల్ దగ్గర దోశలు వేశారు. ఈ సందర్భంగా కాస్త హడావుడి చేశారు పాల్. నిజానికి పాల్ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. దోశల బండి దగ్గర కూడా అంతే హడావుడి చేశారు. ఉంగరం గుర్తుని కేటాయించారని..తనకు ఓటు వేసి గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తానని అన్నారు.
Advertisement
బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తనకే ఓటు వేయాలంటున్నారు పాల్. సీరియల్ నెంబర్ 17 అని చెప్పి.. కుల, కుటుంబ అవినీతి పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మునుగోడుని అభివృద్ధి చేసుకుందామన్నారు. రాజకీయ నాయకుల దొంగ మాటలు నమ్మొద్దని పాల్ చెప్పిన మాటలను జనం ఉత్సాహంగా వింటూ ఉండిపోయారు.
తాను ఏ హోటల్ లో అయితే దోసెలు వేశానో.. ఆ దంపతుల ఇద్దరు పిల్లలని కేజీ టు పీజీ వరకు చదివిస్తానని హామీ ఇచ్చారు పాల్. నిరుద్యోగులందరూ తన కేఏ పాల్ యాప్ లో లాగిన్ అవ్వాలని కోరారు. మునుగోడుని అమెరికా చేసి పారేద్దామని.. ఉన్న ఏడు మండలాల్లో ఏడు వేల మందికి ఆరు నెలల్లోనే ఉద్యోగాలు ఇస్తానని.. రెండు సంవత్సరాలలోపు నిరుద్యోగ సమస్యే లేకుండా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.