Advertisement
బీఆర్ఎస్ ను ఆడుకోవడంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రూటే సపరేటు. ఆమధ్య సెక్రెటేరియట్ ప్రారంభం విషయంలో కోర్టు వరకు వెళ్లారు. అగ్నిప్రమాదం జరిగితే స్పాట్ కి వెళ్లి నానా రచ్చ చేశారు. బీఆర్ఎస్ రిలేటెట్ గా ఏ ఇష్యూ తెరపైకి వచ్చినా వెంటనే పాల్ మీడియా ముందుకు రావడం కొన్నాళ్లుగా కామన్ గా జరుగుతోంది. తాజాగా కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోసారి ఆయన రెచ్చిపోయారు.
Advertisement
లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత అరెస్ట్ ఖాయమన్నారు పాల్. మార్చి 10న ఆమె అరెస్ట్ కాబోతున్నారని జోస్యం చెప్పారు. ఇక్కడినుంచే కేసీఆర్ పతనం స్టార్ట్ అవుతుందని ఆరోపించారు. తెలంగాణలో రైతులు, అమరవీరుల కుటుంబాలు, నిరుద్యోగుల కన్నీరు ఉసురు కేసీఆర్ కుటుంబానికి తాకిందని అన్నారు. కేవలం ఓట్ల కోసమే పథకాలు తీసుకొచ్చి ఆ తర్వాత విస్మరించారన్న పాల్.. కేసీఆర్ దేవుడినే శత్రువుగా చేసుకొని ఫలితం అనుభవిస్తున్నారని విమర్శలు చేశారు.
Advertisement
మరోవైపు పాల్ కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిక్కర్ స్కామ్ పై మాట్లాడేందుకు హడావుడిగా వచ్చేరే ఏమో.. పైన డ్రస్ వేసుకుని కింద ప్యాంట్ మర్చిపోయి వచ్చారు పాల్. ఇది ఒక ఫ్యాషన్ ఏమో అని కొందరు అంటుంటే.. అమ్మాయిలకి బాగానే ఉంటుంది.. మగాళ్లకి బాగోదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రకరకాల కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
ఇక ఈడీ నోటీసుల తర్వాత ఢిల్లీ వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కోసమే ఆమె అక్కడకు వెళ్లారు. అయితే.. 9న విచారణకు రావాలన్న నోటీసులపై 15కి పోస్ట్ పోన్ చేయాలని ఈడీని కోరారు. దీనిపై అధికారులు ఎలా రియాక్ట్ అవుతారనేది సస్పెన్స్ గా మారింది.