Advertisement
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఎలాంటి విధ్వంసాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుదలైన ప్రతి భాషలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2000 కోట్ల మార్కును అధిగమించి రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్ లను సైతం వెనక్కి నెట్టి రాఖీ బాయ్ టాప్ ప్లేస్ లో నిలిచాడు.
Advertisement
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూకి విచ్చేసిన సీనియర్ జర్నలిస్టు భరద్వాజ్ కేజీఎఫ్ సినిమా గురించి యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. బాలీవుడ్ సంజయ్ దత్ గురించి మాట్లాడుతూ అదిరా పాత్రని ఆయన తన శరీరంతో నటించాడు. ఇలాంటి వైవిద్య భరితమైన పాత్రలు పోషించడం కానీ, వాటిని పర్ఫెక్ట్ గా పండించడం కానీ సంజయ్ కి కొత్తమీ కాదు. అందుకే ఆయనను సెలెక్ట్ చేశారు. ఆశించిన విధంగానే మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో రాఖీ బాయ్ ను కనబరిచారు సంజయ్ అని అన్నారు. అయితే ఈ సినిమాను కైకాల సత్యనారాయణ సమర్పించారు. అంటే ఇతని ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అందింది అని చెప్పాలి.
Advertisement
మొదటి పార్ట్ సమయంలో కూడా కైకాల ఈ సినిమా గురించి యష్ చాలా గొప్పగా మాట్లాడారు. అలాగే కైకాల వారసుడు, శాండిల్ వుడ్ లో నిర్మాణ రంగంలో ఉన్నాడు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ సినిమాకు సహనిర్మాతగా ఉన్నాడు. ఆ సమయంలోనే సినిమా హిట్ అవుతుందని అంచనా వేసిన కైకాల తనయుడు తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. అయితే టాలీవుడ్ లో సాయి కోర్రపాటి వంటి టాప్ ప్రొడ్యూసర్ తో ఉంటే సినిమాకు క్రేజ్ వస్తుందని భావించాడు. దీంతో ఆయనను కలిసి తెలుగులో కేజిఎఫ్ సినిమాను విడుదల చేశాడు. అలా తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇక్కడ దాదాపు రూ. 18 కోట్ల రూపాయల షేర్ ను కూడా వసూలు చేసింది. ఈ సినిమా సమయంలోనే కేజీఎఫ్ యూనిట్, సత్యనారాయణకు సన్మానం కూడా చేసింది. ఆ విధంగా ఈ సినిమా సక్సెస్ వెనుక కైకాల ఉన్నారు.
READ ALSO : మణిరత్నం “పొన్నియన్ సెల్వన్” చూసాక మీకు ఇదే డౌట్ వచ్చిందా ? ఇది నిజమే నా అస్సలు నమ్మలేరు !