Advertisement
Kalki 2898 AD Review: కల్కి 2898 AD సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సి. అశ్వని దత్ నిర్మించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, బ్రహ్మానందం తదితరులు ఇందులో నటించారు. డిజోర్డ్జే స్టోజికోవిచ్ సినిమాటోగ్రఫీ అందించారు. సంతోషం నారాయణ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇక ఈ సినిమా కథ, రివ్యూ, రేటింగ్ చూసేద్దాం.
Advertisement
సినిమా: కల్కి 2898 AD
నటీ నటులు: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని,
బ్రహ్మానందం తదితరులు
దర్శకుడు: నాగ్ అశ్విన్
నిర్మాత: సి. అశ్వని దత్
సంగీతం: సంతోషం నారాయణ్
రిలీజ్ డేట్: 27 జూన్ 2024
కథ మరియు వివరణ:
సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందించిన చిత్రంగా కల్కి 2898 AD చిత్రం నిలిచిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ మూవీ రూ. 600 కోట్లు దాటిందట. నటినతుల వేతనాలు, సెట్స్ కి అయిన ఖర్చులు అలాగే నాణ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని అత్యాధునిక వీఎఫెక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారట. ఈ సినిమాలో ప్రభాస్ నడిపే వెహికల్ ను మహేంద్ర రీసెర్చ్ వ్యాలీ టీం తో పాటుగా కోయంబత్తూర్ లోని జయం ఆటో ఇంజనీరింగ్ సహకారం ఇచ్చింది.
ఒక కారు కోసమే నాలుగు కోట్లు ఖర్చు పెట్టారట. అలానే ఈ సినిమాలో కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఆయన కనిపిస్తున్న లుక్స్ కోసం అనేక టెస్టులు చేశారు. చివరకు చిత్ర బృందం లాస్ ఆంజల్స్ వెళ్లి హాలీవుడ్ మూవీస్ కి పని చేసే మేకప్ నిపుణులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అయితే ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా మీద అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం కథ విషయానికి వచ్చేస్తే… భూమ్మీద కొన్ని విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు అన్యాయాలు అక్రమాలు పెరిగిపోయినప్పుడు మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి సమస్త సమస్యలకు పరిష్కారాన్ని చూపించబోతున్నట్లుగా ఇంతకుముందు పురాణాల్లో మనం తెలుసుకున్నాము. ఇక ఆ పురాణాలని బేస్ చేసుకుని ఈ సినిమాని తీశారు కలి (కమల్) హాసన్ ఎలాంటి విపత్కర పరిస్థితులను సృష్టించాడు..? భైరవ (ప్రభాస్) కల్కి కలిసి దాన్ని ఎలా అడ్డుకున్నారు..? అతన్ని ఎలా అంతం చేస్తారు అనేది తెలియాలంటే సినిమా చూడాలి. ఈ మూవీ ని నాగ్ అశ్విన్ డిఫరెంట్ గా తీశారు ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేస్తూ ముందుకు సాగుతుంది.
Advertisement
విజువల్స్ పరంగా అయితే నాగ్ అశ్విన్ తీసుకున్న కేర్ చాలా బాగుంది అని అంతా అంటున్నారు. చాలా చోట్ల ఒక వేరే వరల్డ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది. కల్కి మూవీ కథ పరంగా చూసుకుంటే మహాభారతాన్ని బేస్ చేసుకుని వచ్చింది. విజువల్స్ పరంగా ఈ సినిమాను చాలా గ్రాండ్ గా చూపించారు. మైండ్ లో ఏదైతే అనుకున్నాడో అది స్క్రీన్ మీద పెట్టి సక్సెస్ అయ్యాడు. భైరవ ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్, భైరవకి అశ్వద్ధామకి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకి హైలైట్ అయ్యాయి. మూవీలో ప్రతి పాత్రకి చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. కొన్ని క్యారెక్టర్స్ పోషించిన ప్రతి ఒక్కరి పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు అందువలన ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అయ్యే విధంగా హెల్ప్ అయ్యింది.
గ్రాఫిక్స్ వర్క్ బాగున్నప్పటికీ కొన్నిచోట గ్రాఫిక్స్ అని ఈజీగా తెలిసిపోతుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చేసి కానీ క్లైమాక్స్ లో వచ్చే ఫైవ్ టైప్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఫస్ట్ హాఫ్ బోర్ లేకుండా ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది. కానీ మొత్తానికి సినిమాని ఇంట్రెస్టింగ్గా తీశారు. ఆర్టిస్టులు కూడా నూటికి నూరు శాతం న్యాయం చేశారు. దీపికా పదుకొనే, అమితాబచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్ వీళ్ళందరూ నెక్స్ట్ లెవెల్లోకి సినిమాను తీసుకెళ్లారు. కమల్ హాసన్ చేసిన పాత్ర మాత్రం ఒక 50 ఏళ్ళు వరకు అందరికీ గుర్తుండిపోతుంది. అంత అద్భుతంగా ఉంది. సంతోష్ నారాయణ అందించడం మ్యూజిక్ ఈ సినిమాకి చాలా దాకా ప్లస్ అయింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి కాబట్టి ఈ సినిమాను కూడా సంతోష్ నారాయణ చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చి బ్యాగ్రౌండ్ స్కోర్ లో ఎక్కడ తగ్గకుండా ఎమోషన్స్ ను బాలన్స్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వచ్చేస్తే వైజయంతీ మూవీస్ వాళ్ళు అస్సలు తగ్గలేదు సినిమా అవుట్ అండ్ ఒక బెస్ట్ ప్రోడక్ట్ గా మార్చడానికి బాగా ఖర్చు చేశారు.
Also read:
ప్లస్ పాయింట్స్:
ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకునే నటన
స్టోరీ విజువల్స్
దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉండడం
గ్రాఫిక్ వర్క్స్
Rating: 2.75/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!