• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » కమలహాసన్ ఆ సినిమాలో బాలనటుడిగా అల్లు వారబ్బాయి..ఎవరంటే..?

కమలహాసన్ ఆ సినిమాలో బాలనటుడిగా అల్లు వారబ్బాయి..ఎవరంటే..?

Published on August 16, 2022 by mohan babu

Advertisement

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అల్లు వారి కుటుంబానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఇప్పటికే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు.. అయితే అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ కాకుండా మరో వ్యక్తి కూడా కమలహాసన్ తో ఒక సూపర్ హిట్ సినిమాలో బాలనటుడిగా నటించి ప్రస్తుతం సినిమాల్లో కనబడడం లేదు.. కానీ ఒకటి రెండు సినిమాల్లో ముఖ్యంగా స్టార్ హీరో కమల్ హాసన్ సినిమాలో కనిపించడం ఆయన అదృష్టం అని చెప్పుకుంటారు.. మరి ఇంతకు అల్లు వారి అబ్బాయి ఎవరో ఒకసారి చూద్దాం.. భారతీయ చలనచిత్ర రంగంలో హీరో కమలహాసన్ కి ఒక ప్రత్యేకమైన స్థానం.

Also Read: జాతీయ జెండాను అవమానించిన రోహిత్‌..అంటూ నెటిజన్లు ఆగ్రహం..మీరు ఇంత ఫేకా ?

దశావతారం, భారతీయుడు, స్వాతిముత్యం వంటి సినిమాలతో అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు ఆయన.. అందుకే ఆయనతో నటించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఛాన్స్ దొరికితే మాత్రం అదృష్టంగా భావిస్తారు. అలాంటి అదృష్టాన్ని అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీకీ దక్కిందని చెప్పవచ్చు.. ప్రస్తుతం అల్లు బాబి టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, సహనిర్మాతగా కొనసాగుతున్నారు. ఆయన బాలనటుడిగా కమలహాసన్ సినిమా లోనే కాకుండా మెగాస్టార్ చిరంజీవి విజేత మూవీ లో కూడా చేశారు. కళాతపస్వి కె.విశ్వనాథ్ అల్లు అరవింద్ ల మధ్య మంచి పరిచయం ఉంది.

Advertisement

Also Read:   ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా కి నెగిటివ్ టాక్ రావడానికి కారణాలు ఇవే! 

అయితే విశ్వనాథ్ షూటింగ్ టైం లో అప్పుడప్పుడు అల్లుఅరవింద్ అక్కడికి వెళ్లేవారట.. అయితే స్వాతి ముత్యం సినిమాలో చిన్న పిల్లల క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో అల్లు అరవింద్ తన పెద్ద కుమారుడు బాబీని తీసుకుని వెళ్లారట.. ఈ క్రమంలోనే కళాతపస్వి ఆ బాబి ని చూసి మా సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం మీ బాబును తీసుకోవచ్చా అని అడిగారట. దీంతో అల్లు అరవింద్ ఓకే చెప్పి హామీ ఇచ్చారు.. ఈ సినిమాలో నటుడు కమలహాసన్ మనవడిగా బాల నటుడిగా నటించారు బాలు.. ఈ విధంగా ఆయన చిన్నతనంలోనే సినిమాల్లో నటించారు. ఇప్పటికే బాబి తమ్ముడు అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక అల్లు శిరీష్ కూడా హీరోగా రాణించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ALSO READ:ఆ నటుడితో భార్యగా, చెల్లిగా, కూతురుగా నటించిన రమ్యకృష్ణ..ఆయన ఎవరో తెలుసా..?

Latest Posts

  • రాహుల్ అనర్హత వెనక్కి తీసుకోవాలి.. పోరాటం మరింత ఉద్ధృతం
  • రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా?
  • అమిత్ షా ను కలుస్తానన్న కోమటిరెడ్డి.. ఎందుకు?
  • శ్రీదేవి రాజశేఖర్ పెళ్లిని అడ్డుకున్నది ఎవరో తెలుసా..?
  • వెన్నునొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలు పాటించాల్సిందే..?

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd