Advertisement
కాంతారా..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ మూవీ పేరు వినిపిస్తోంది. ఎంతో సింపుల్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే215 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రం కథ విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాలో ఉండే తుళు భాష మాట్లాడే ప్రజలు ఏటా ఆత్మలు లేదా దేవతలతో కలిసి ఒక జానపద సాంప్రదాయమే భూతకోల.. ఈ సాంప్రదాయాన్ని హైలెట్ చేసి సినిమా తెరకెక్కించారు రిషబ్ శెట్టి.. ఈ సినిమాలో ఆధ్యాత్మికతను జోడించడం వల్ల ప్రజలకు ఎక్కువగా కనెక్ట్ అయి ఎక్స్పెక్ట్ చేయనంత హిట్ అయింది.. అలాంటి సినిమాలో రిషబ్ శెట్టి మిస్టేక్స్ చాలా వరకు చేశాడని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:ఆపరేషన్ తర్వాత వంకాయ తినొద్దని ఎందుకు చెబుతారు?
Advertisement
1.ఈ సినిమాలో ముఖ్యంగా నచ్చనిది హీరోయిన్ తో వెక్కిలి వేషాలు. నిజానికి చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ అవసరం లేదు. కానీ సినిమా అంటే హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారు అంతే. కానీ ఇందులో హీరోయిన్ బాత్రూంలో స్నానం చేస్తుంటే, అందులో ఉన్న బొక్కల్లోంచి హీరోయిన్ అందాలను చూడటం చాలామంది ఆడియన్స్ కు కాస్త ఇబ్బంది కలిగించింది. హీరోయిన్ తో హీరో కొన్ని సీన్లలో నటించే విధానం చూసి ఫ్యామిలీతో సినిమాకు వచ్చిన వారికి ఈ సీన్ అయిపోతే బాగుండు అనే ఫీలింగ్ వచ్చిందట.
2. అంతేకాకుండా కాంతారా మూవీలో పందిని వరాహరూపమని ఆ గ్రామస్తులు కొలుస్తారు. పందిని వారి కులదైవం ఇలవేల్పు అని అంటుంటారు. హీరో వేటకు వెళ్లిన ప్రతిసారి పందిని వేటాడొద్దని ఆ మాంసం తినవద్దని తన తల్లితో తిట్లు తింటూనే ఉంటాడు. ఈ విధంగా వరాహ రూపాన్ని దేవుడిగా భావించే వారే ఆ మాంసాన్ని తినడం ఈ సినిమాలో మరో మిస్టేక్ గా చెప్పవచ్చు. కానీ సినిమాలో ఇన్ని మిస్టేక్స్ ఉన్న కథలో గొప్పతనం లేకున్నా, మూవీ తీసిన తీరు, నటీనటుల నటన, రియల్ లొకేషన్స్, భూతకోల నృత్యం, రిషబ్ శెట్టి యాక్టింగ్ ఈ సినిమాకు మరింత హైప్ తెచ్చిందని చెప్పవచ్చు. దీనివల్లే ఈ మూవీ హిట్ అయింది.
also read: