• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Telugu Action

Latest Telugu News Portal

  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movies
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Home » కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే!

కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, నియమాలు ఇవే!

Published on October 30, 2022 by karthik

Advertisement

ప్రతి మాసంలోను ఏవో కొన్ని పండగలు రావడం సహజం. కానీ కార్తీకమాస విశిష్టత ఏమిటంటే, ఇందులో ప్రతిరోజు ఒక పండుగే! జపతపాలతో, ఉపవాసాలతో, దీప దానాలతో, కార్తీక స్నానాలతో, వ్రతాలతో కార్తీకమాసం అంతా దైవం నామస్మరణతో మార్మోగిపోతుంటుంది. కార్తీక మాసం లో భగవంతుని పూజించేందుకు పెద్ద క్రతువులు ఏమి చేయనవసరం లేదు. కోరి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా నిష్ట. కార్తీకమాసంలో ఉపవాసం ఎలా చేయాలి. నియమాలు ఇవే.

శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యము బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణకాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు.

Advertisement

ఇవి చేస్తే మంచిది

ఈ మాసంలో చేసే స్నాన, దాన, జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజున నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మ చెప్పాడు. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో సమస్త పాపాలు బస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌక్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణం లోని అనేక గాధలు, ఇతివృత్తాలు, ఉదాహరణలను బట్టి తెలుసుకోవచ్చు.

 

ఇది చేయరాదు

తామనం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవ దూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనె ఇతరాత్ర అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు. కార్తీకమాసంలో చేసే దీపారాధన వలన గత జన్మ పాపాలతో సహా ఈ జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. స్త్రీ ఈ దీపారాధన చేయడం వలన సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయి. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించుకొని జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలన్నదే ఈ దీపారాధన ఉద్దేశం.

Advertisement

ఇవి కూడా చదవండి : పవర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే..!

Related posts:

కార్తీకమాసంలో ఇలా చేస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయి..! బాలాపూర్ లడ్డు వేలంపాటలో వచ్చిన డబ్బుని ఉత్సవ సమితి ఎం చేస్తుందో తెలుసా? మీ ఇంట్లో పావురాల గూడు ఉందా? అయితే ఈ సమస్యలు అవుతాయట ! మంగళ, శుక్రవారాల్లో ఇతరులకు డబ్బులు ఇవ్వరు ఎందుకంటే..?

Latest Posts

  • Ys. జగన్ రాజకీయ ప్రస్థానంలో మీరు ఎప్పుడూ చూడని రేర్ ఫొటోస్..!!
  • భార్యను లాడ్జికి రప్పించి భర్త ఏం చేశాడో తెలుసా ?
  • పెళ్లి చేసుకునే అమ్మాయిలు.. అబ్బాయిల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి ?
  • భార్య కోసం ఖండాలు దాటిన భర్త.. సైకిల్ పైనే స్వీడన్ కు..!
  • ఒక్క మిస్డ్ కాల్ అంత పని చేసిందా ? రెండు నిండు ప్రాణాలు..!

Copyright © 2023 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd