Advertisement
ప్రస్తుతం ఎక్కడ చూసినా నాటు నాటు పాటకు సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తర్వాత దేశంలో చాలా నెలలపాటు ఈ పాట మార్మోగిపోయింది. ఈ పాటకి ఎంతో ఆదరణ లభించింది.అంతర్జాతీయంగా కూడా అత్యున్నత అవార్డు అయినా ఆస్కార్ అవార్డు రావడంతో ఇండియన్స్ అంతా ఆనందపడ్డారు.అయితే, కీరవాణి ఆస్కార్ అవార్డు తీసుకునేటప్పుడు దీని వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు కార్తికేయ.ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషనల్‌లో భాగంగా జూనియర్ ఎన్‌టిఆర్ కార్తీకేయ పేరును బయటకు తీయడంతో వీరుడు, శూరుడు అని ప్రశంసించాడు.
also read:రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో తగ్గేదే లేదంటున్న కోమటిరెడ్డి
కార్తీకేయ ఏం చేశాడు, ఏలా చేశాడు.. అసలు ఆయన ఎవరు… కార్తీకేయ రాజమౌళి దత్త పుత్రుడు… రాజమౌళి భార్య రమ మొదటి భర్తకు జన్మించిన వాడే కార్తీకేయ. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి కథ, రచన, పాటలను సెలెక్ట్ చేసుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డు వరకు కార్తికేయ తెలివితేటలు కనిపిస్తాయి. ఆర్‌ఆర్‌ఆర్ మార్కెటింగ్ ప్రపంచంలో వివిధ దేశాలలో ప్రదర్శన, డబ్బు లెక్కలు అని కార్తికేయ చూసుకునేవాడు.
Advertisement
Also Read: Telugu News, Tollywood Telugu cinema News
తాను మార్కెటింగ్ జీనియస్, ఒక ముక్కలో చెప్పాలంటే ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు వెన్నెముక లాంటి వాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో బయట ప్రపంచానికి రామ్‌చరణ్, ఎన్‌టిఆర్,రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్ కనిపించే సింహాలు అయితే కనిపించని సింహం కార్తికేయ. కార్తికేయ లేకపోతే ఆస్కార్ అవార్డు ముంగిట్లో అడుగుపెటేవాడే కాదు. ఇక్కడ ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ఎంత డబ్బు ఖర్చు పెట్టిన విషయం పరిగణనలోకి రాదు, కెజిఎఫ్, బాలీవుడ్ సినిమా దర్శక నిర్మాతలు డబ్బులు పెట్టలేరా? అనేది సమస్య కాదు. సరైన మార్గంలో ప్రయాణించి ఆస్కార్ చేరుకోవడమనేది కార్తికేయ గొప్పతనాన్ని సూచిస్తుంది. ఎక్కువ సంతోషం వ్య క్తం చేయా ల్సిన వ్యక్తి ఎవరంటే రాజమౌళి భార్య రమ.
Advertisement
Read also: రెస్టారెంట్ లు GST బిల్లులు పేరుతో మనల్ని ఎంతలా మోసం చేస్తున్నారో తెలుసా ?