Advertisement
Karuvu Pani: Karuvu Pani and Money Checking, కరువు పని డబ్బులు : పేద ప్రజల కోసం భారతదేశంలో అప్పటి ప్రభుత్వం 2005లో MGNREGS 2005 యాక్ట్ తో ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా చేసే పనులను కరువు పని Karuvu Pani అని కూడా పిలుస్తారు. ప్రధానంగా ఈ పథకం పేదలకు పని కల్పించే విధంగా భరోసాను ఇస్తుంది.మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ హామీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 100 పని దినాలు పని కల్పించడం తప్పనిసరి.
Advertisement
Advertisement
అదేవిధంగా ఈ పథకం ద్వారా పని చేసే వారికి కనీస వేతనం కూడా చెల్లించాలి. ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారిగా కనీస వేతనాన్ని నిర్ణయిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో 2022-2023కి సంబంధించి రూ.257 రూపాయలను చెల్లిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉపాధి హామీ డబ్బులను చెల్లిస్తున్నారు. ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో అత్యధికంగా రోజుకు రూ.331 చెల్లించగా.. కేరళ 311, కర్ణాటక 309 చెల్లిస్తే.. అతితక్కువగా మధ్యప్రదేశ్, ఛతీష్ ఘడ్ రాష్ట్రాల్లో రూ.204 మాత్రమే చెల్లిస్తున్నారు.
Karuvu Pani and Karuvu Pani Amount Checking in Telangana: ఉపాధి హామీ పథకం డబ్బులు చెక్ చేసే విధానం :
- పథకం లబ్ది పొందాల్సిన వ్యక్తి తొలుత అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- http://nrega.nic.in/Nregahome/MGNREGA-new/Nrega-home.aspx.
- హోమ్ పేజీలోకి వెళ్లి Job Carsds లింక్ పై క్లిక్ చేయాలి
- ఆ Job Carsds లోకి వెళ్లిన తరువాత మీ సొంత రాష్ట్రం, తెలంగాణ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి
- తెలంగాణ రాష్ట్రం పేజీ ఓపెన్ అయిన తరువాత, అందులో ఏ సంవత్సరం, ఏ జిల్లా, ఏ బ్లాక్, ఏ పంచాయితీ వివరాలను ఎంటర్ చేసి ప్రొసీడ్ కావాలి
- మీరు ఎంటర్ చేసిన పంచాయితీలో ఉన్న లబ్దిదారులందరి పేర్లు వస్తాయి. అందులో మీ పేరును Job Card నంబర్ తో సులభంగా సెర్చ్ చేసుకోండి
- మీ జాబ్ కార్డ్ నంబర్ పై క్లిక్ చేయగానే మీ జాబ్ కార్డ్, పని చేసిన కాలం, ఏ పని చేశారనే దానికి సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. అక్కడే ఓ రెడ్ లింక్ ఉంటుంది. దాని పై క్లిక్ చేయగానే పని తేది, పని చేసిన స్థలం, రోజులు, అమౌంట్ కు సంబంధిచిన పూర్తి వివరాలు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. https://nrega.nic.in/nregahome/