Advertisement
“ది కాశ్మీర్ ఫైల్స్” మూవీ తో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. 1990లో కాశ్మీర్ లో హిందువులు, ముఖ్యంగా కాశ్మీరీ పండిట్లపై సాగించిన అఘాయిత్యాలు, హింసపై కాశ్మీర్ ఫైల్స్ సినిమాను తీశారు. ఈ సినిమా కలిగించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది. కాశ్మీర్లో జరిగిన దారుణ హింసకాండను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేకా అగ్నిహోత్రి కళ్ళకు కట్టినట్టు చూపించారని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకున్న వివేక్ అగ్నిహోత్రి ఇప్పుడు “ది వ్యాక్సిన్ వార్” అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉండే వివేక్.. దేశంలో చోటు చేసుకునే పలు అంశాలపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటారు.
Advertisement
Read also: ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!
ఈ నేపథ్యంలోనే తాజాగా కాంగ్రెస్ ఆగ్రనేత రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ పై అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. కొద్దికాలం క్రితం మోడీ ఇంటిపేరు ఉన్న వారందరూ దొంగలు అని రాహుల్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గుజరాత్ బిజెపి ఎమ్మెల్యే పూర్నేష్ మోదీ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై పరువు నష్టం దావా వేయగా, సూరత్ కోర్టు దోషిగా తేల్చింది. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం రాహుల్ ఎంపీ సభ్యత్వం పై అనర్హత వేటు పడింది.
Advertisement
అయితే దీనిపై తాజాగా వివేక అగ్నిహోత్రి స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ఎప్పుడో అనర్హుడు అని అన్నారు. “రాజకీయాలలో అర్హత లేని నేత రాహుల్ గాంధీ. అయితే ప్రస్తుతం అది అధికారికంగా రుజువైంది” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అంతే కాకుండా గతంలో ఇందిరా గాంధీ పై కూడా అనర్హత వేటుపడిందని గుర్తు చేశారు. అయితే ఆమె నిజమైన నాయకురాలు కావడంతో తిరిగి పుంజుకున్నారని చెప్పారు. అయితే ప్రస్తుతం మాస్ లీడర్ లేని పార్టీ కాంగ్రెస్ అని.. అలాంటి పార్టీ తిరిగి పుంజుకుంటుందని ఆశ కనిపించడం లేదన్నారు. ఒకవేళ గాంధీ కుటుంబం కాశ్మీర్ ని కాపాడి ఉంటే.. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు తీసి ఉండే వాడిని కాదు అని అన్నారు. అయితే వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తుందని తెలుస్తుంది.
Rahul Gandhi was always unqualified. It’s just that now it’s been made official.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 27, 2023