Ads
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ పాఠశాల విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. విషయంలోకి వెళ్తే ప్రతి పాఠశాలలో ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం తరహాలో ఉదయం అల్పాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Advertisement
ఈ క్రమంలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరుతో అల్పాహారం అందించనున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. దసరా రోజు అనగా అక్టోబర్ 24వ తారీకు నుంచి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారట.పాఠశాల పని దినాలలో ఉదయం అల్పాహారం అందించనున్నారు.ఈ పథకం వల్ల ఖజానా పై రూ.400 కోట్ల అదనపు భారం పడనుందని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఉదయాన్నే వ్యవసాయ పనులు మరియు కూలీ పనులకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక ఇదే పథకం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ ఉంది.అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారుల బృందం పరిశీలించి అనంతరం సీఎం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో మానవీయ కోణంలో ఆలోచించే కేసీఆర్. ప్రభుత్వం విద్యార్థులకు ఉదయాన్నే అల్పాహార భోజన పథకాన్ని అమలు చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.