Advertisement
Keeda Cola Movie Review in Telugu : టాలీవుడ్ యంగ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఈయన చాలా సున్నితమైన కథలను రాసుకొని.. వాటిలో నవ్వించే స్కిల్స్ ను పుట్టించడం తరుణ్ భాస్కర్ నైజం.
Advertisement
అయితే ఇతని లో మంచి నటుడు కూడా ఉన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే ఈసారి తాను నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా కీడా కోలా. ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Keeda Cola Cast and Crew Details
నటీ, నటులు : తరుణ్ భాస్కర్, చైతన్య, రాగ్ మయూర్, బ్రహ్మానందం, విష్ణు, జీవన్, రవీంద్ర విజయ్, రఘురాం తదితరులు.
దర్శకుడు : తరుణ్ భాస్కర్
సంగీతం : వివేక్ సాగర్
సినిమాటోగ్రాపర్ : A J అరోన్
ఎడిటింగ్ : ఉపేంద్ర వర్మ
నిర్మాతలు : వివేక్ సుదాంశ్, సాయికృష్ణ, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద నందరాజ్, ఉపేంద్ర వర్మ.
వ్యవధి : 120 నిమిషాలు
విడుదల తేదీ : నవంబర్ 03, 2023
Keeda cola Story కథ :
వాస్తు (చైతన్య రావు)కి కాస్త నత్తి ఉంటుంది. చిన్నప్పుడే పేరేంట్స్ మరణించడంతో తాత వరదరాజు(బ్రహ్మానందం)తో కలిసి ఉంటాడు. వాస్తు స్నేహితుడు కౌశిక్ అలియాస్ లంచం(రాగ్ మయూర్) ఓ లాయర్. ఈ ముగ్గురికి డబ్బు చాలా అవసరం. డబ్బు సంపాదించడం కోస్లం ప్లాన్ చేస్తున్న తరుణంలో కీడాకోలా బాటిల్ లో బొద్దింక కనిపిస్తుంది. వెంటనే లాయర్ కౌశిక్ కి ఓ ఆలోచన వస్తుంది. ఈ బొద్దింకను చూపించి కీడా కోలా కంపెనీ నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని ప్లాన్ వేస్తాడు. యజమానికి ఫోన్ చేసి రూ.5కోట్లు డిమాండ్ చేస్తాడు. మరోవైపు జీవన్ కార్పొరేటర్ కావాలనుకుంటాడు. 20 ఏళ్ల తరువాత జైలు నుంచి విడుదలైన అన్న నాయుడు(తరుణ్ భాస్కర్ )కి తన కోరిక చెబుతాడు. కార్పొరేటర్ కావాలంటే డబ్బు అవసరం.. డబ్బు కోసం ఓ కుట్ర పన్నుతారు. ఆ కుట్ర ఏంటి..? వాస్తు గ్యాంగ్, నాయుడు గ్యాంగ్ ఎలా కలిశాయి. రెండు గ్యాంగ్ లతో కంపెనీ యజమాని కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి చివరికీ చేసింది ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో వీక్షించాల్సిందే.
Advertisement
Keeda Cola Movie Review విశ్లేషణ :
తరుణ్ భాస్కర్ గత సినిమాలు నిజ జీవితంలో ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వాటికి పూర్తిగా భిన్నంగా తెరకెక్కించిన చిత్రం కీడా కోలా. లాజిక్స్ ని పక్కకు పెట్టి కేవలం నవ్వించడమే టార్గెట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇది ఒక రొటిన్ Criమ్ కామెడీ చిత్రం. కానీ తరుణ్ కథను నడిపించిన తీరు, మాటలు, పాత్రలకు పెట్టి మాడ్యులేషన్ కారణంగా డిఫరెంట్ గా అనిపిస్తుంది. వాస్తు, లంచం పాత్రలను పరిచయం చేస్తూ కోర్టు సన్నివేశంతో కథను ప్రారంభించాడు. ఆ తరువాత వెంటనే జీవన్ గ్యాంగ్ ను పరిచయం చేసి.. ఈ రెండు గ్యాంగ్ ల పరిస్థితి ఏంటి? ఎలా వ్యవహరిస్తారనే క్లారిటీ మొదట్లోనే ఇచ్చాడు. శ్వాస మీద ధ్యాస, రోజుకు గంట ఇంగ్లీషు అంటూ నాయుడి పాత్ర పడించే కామెడీ థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అసలు కథను పక్కన పెట్టి సరదా సన్నివేశాలతో ఫస్ట్ హాప్ కొనసాగుతుంది.
సెకండాఫ్ లో ఊహకు తగ్గట్టుగానే సాగుతుంది. కీడా కోలా యాడ్ లో నటిస్తూ హీరోగా గెటప్ శ్రీను కామెడీ ఆకట్టుకుంటుంది. రెండు గ్యాంగ్ ల మధ్య వచ్చే సరెండర్ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది. తరున్ భాస్కర్ లో మంచి నటుడు ఉన్నాడని నిరూపించింది. వాస్తు పాత్ర కోసం చైతన్య పడిన కష్టం తెరపై కనిపించింది. లాయర్ లంచం పాత్రకు రాగ్ మయార్ న్యాయం చేశాడు. విష్ణు తనదైన కామెడీతో నవ్వించాడు. తాతగా బ్రహ్మనందం వీల్ ఛైర్ కే పరిమితమయ్యాడు. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. తరుణ్ భాస్కర్ డైలాగ్ లు నవ్వులు తెప్పించాయి. బూతులు వాడాల్సిన చోట పాటలు వినిపించి సెన్సార్ వారికి పని తగ్గించాడు. సినిమా నిడివి రెండు గంటలే ఉండటం వల్ల కలిసొచ్చిందనే చెప్పాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చే అవకాశముంది.
ప్లస్ పాయింట్స్ :
- తరుణ్ భాస్కర్
- గెటప్ శ్రీను
- విష్ణు కామెడీ
- డైలాగ్స్
నిడివి తక్కువ
మైనస్ పాయింట్స్ :
- ఫస్టాప్ కాస్త బోరింగ్
- ఊహకు అందేలా సాగే కథనం
రేటింగ్ : 2.5/5