Advertisement
దేశంలో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సేకరించిన బఫర్ స్టాక్ ని మార్కెట్ లోకి విడుదల చేయాలని నిర్ణయించింది. తాజాగా ఈ మేరకు ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 3లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను కేంద్రం బఫర్ స్టాక్ గా గోదాముల్లో భద్రపరిచింది. యేటా మార్కెట్ లోకి సరఫరా తగ్గి.. ధరలు పెరిగిన సందర్భాల్లో కేంద్రం ఆ బఫర్ స్టాక్ ని విడుదల చేస్తుంటుంది.
Advertisement
Advertisement
దేశంలోని పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన మార్కెట్లకు ఉల్లి నిల్వలను పంపించాలని నిర్ణయించాం. ఈ ఏడాదిలోనే అత్యధిక ధరలు నమోదు అయిన దేశంలోని సగటు ఉల్లి రేటు కంటే ఎక్కువగా ఉన్న.. గత నెలతో పోల్చితే ధరలు పెరిగిన ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తాం. ఈ వేలం, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా ఉల్లిని సరఫరా చేస్తామని ఆహార మంత్రిత్వశాఖ శుక్రవారం రోజు ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాలు ప్రజా పంపిణీ కోసం కోరితే తగ్గింపు ధరతో వాటిని సరఫరా చేస్తామని అందులో వెల్లడించింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు