Advertisement
” పుట్టినవారికి మరణం తప్పదు.. మరణించిన వారికి పుట్టుక తప్పదు. అనివార్యమగు ఈ విషయం గురించి శోఖింపతగదు” అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి హితబోధ చేస్తాడు. వాస్తవానికి జనన – మరణాలు మన చేతిలో ఉండవు. మరణం అనేది జీవితంలో ఒక చేదు నిజం. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు మరణించాల్సిందే. ధర్మం – అధర్మం, పాపం – పుణ్యం, స్వర్గం – నరకం, జ్ఞానం – అజ్ఞానం, నీతి – నియమాలు వంటి అనేక అంశాల గురించి గరుడ పురాణంలో వివరించడం జరిగింది.
Read also: మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?
గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి మరణం సమీపిస్తున్నప్పుడు అందుకు సంబంధించిన కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ఈ సంకేతాల ఆధారంగా సదరు వ్యక్తి జీవితం ముగింపు దశలో ఉందని తెలుస్తుందట. గరుడ పురాణం హిందూమతంలోని 18 పురాణాలలో ఒకటి. ఇందులో ఒక వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు అన్ని దశలు వివరించడం జరిగింది. అయితే గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి అశుభకరమైన సంఘటనలు జరగబోయే ముందు ఐదు సంకేతాలు కనిపిస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
1) గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి యొక్క ముగింపు దగ్గరికి వచ్చినప్పుడు అతని అరచేతిపై ఉండే రేఖలు మసకబారడం ప్రారంభిస్తాయి.
2) ఒక వ్యక్తి జీవితం ముగియనున్న సమయంలో కొద్దిరోజుల ముందు కలల ద్వారా వారికి కొన్ని సంకేతాలు అందుతాయి. వారి పూర్వీకులు తన కలలో కనిపించడం, వారు ఏడుస్తున్నట్లు లేదా పారిపోతున్నట్లు కనిపిస్తే మరణం దగ్గరలో ఉందని అర్థం.
3) ఒక వ్యక్తి చుట్టూ ప్రతికూల శక్తి భావన ఉన్నప్పుడు అతడికి సమయం ముగియబోతోందని గరుడ పురాణం చెబుతోంది.
4) ఒక వ్యక్తి మరణ గడియలు సమీపిస్తున్నప్పుడు అనేక రహస్యమైన విషయాలను చూడగలుగుతాడు. నిప్పు తగలడం, వరదలలోకి చిక్కుకోవడం వంటివి కూడా అతడికి సమయం ముగియబోతుందని చెబుతాయి.
5) ఒక వ్యక్తి మరణానికి సమీపంలో ఉన్నప్పుడు గతంలో తాను చేసిన చెడు పనుల గురించి గుర్తు చేసుకుంటాడు. మనసులో ఆకస్మిక మార్పులు మొదలవుతాయి. చేసిన చెడు పనులన్నీ ఆ వ్యక్తి మనసులో మెదులుతాయి. పశ్చాతాపం చెందుతాడు.
Advertisement
Read also: చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్ ఏ సినిమాతో అంటే ??