Advertisement
ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ ఒక్కోసారి పలు సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చాలామంది ఈరోజుల్లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. శరీరంలో ఈ లక్షణాలు ఉంటాయి కిడ్నీ సమస్యలను గుర్తు పెట్టుకోవాలి ఎక్కువ రోజులు పాటు నిద్రలేమి సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే కిడ్నీల పనితీరు దెబ్బ తిందని మీరు అర్థం చేసుకోవాలి. కిడ్నీలు ఫిల్టర్ చేయని సమయంలో టాక్సిన్స్ రక్తం లో చేరతాయి దీంతో నిద్ర భంగం ఏర్పడుతుంది.
Advertisement
అలాగే తరచుగా మూత్రంలో రక్తం రావడం కూడా కిడ్నీల పనితీరును దెబ్బ తిందని చెప్పడానికి కారణం. మూత్రంలో నురగ రావడం కూడా కిడ్నీ సమస్యలకి కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే కిడ్నీల పనితీరు దెబ్బతింటే చర్మం పై దద్దుర్లు కనపడతాయి. చర్మం పొడిగా మారడం వంటి సమస్యలు ఎక్కువగా కనబడితే కచ్చితంగా డాక్టర్లని కన్సల్ట్ చేయడం మంచిది. కళ్ళ చుట్టూ ఉబ్బినట్లు కనపడినా కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని నిపుణులు చెప్పారు. మంచి నిద్ర ఉన్నా కళ్ళు ఉబ్బినట్టు కనపడితే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని తెలిపారు.
Advertisement
Also read:
అరికాళ్ళలో వాపు కనపడినా కిడ్నీ ఫెయిల్యూర్ గా భావించాలి. శరీరంలో నీటి శాతం పెరగడం కూడా అరికల్లు ఉబ్బుతాయని డాక్టర్లు అంటున్నారు. రాత్రిపూట ఎక్కువ మూత్ర విసర్జన చేస్తే షుగర్ లక్షణంగా భావించాలి. మూత్రం రంగు ఒక్కసారిగా మారిపోయిన కిడ్నీల పనితీరు దెబ్బతిన్నని మీరు అర్థం చేసుకోవాలి. కిడ్నీలు దెబ్బతింటే మూత్రం ముదురు రంగులో వస్తుంది కాబట్టి ఇలా ఈ లక్షణాలని బట్టి మనం కిడ్నీ సమస్యలను గుర్తించొచ్చు. ఈ లక్షణాలు కనుక మీలో ఏమైనా ఉంటే డాక్టర్ని కచ్చితంగా సంప్రదించడం మంచిది. సమస్యను నయం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!